Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 4]

మానుష్యం

99


ద్వంద్వాని సంప్రవృత్తాని విషయార్థం మహీభుజాం ।
దండ్యతాం సంప్రయాతాని భూతాని భువి భూరిశః ॥
తతో యుద్ధం వినా భూసాః మహీం పాలయితుం క్షమాః ।
న సమర్థా స్తదాయాతాః ప్రజాభిః సహదీనతాం ॥
తేషాం దైన్యాపనోదార్థం సమ్యగ్దృష్టి క్రమాయచ ।
తతో స్మదాధిభిః ప్రోక్తా మహత్యో జ్ఞానదృష్టయః ॥
అధ్యాత్మవిద్యా తేనేయం పూర్వరాజసువర్ణితా ।
తదనుప్రసృతా లోకే రాజవిద్యేత్యుదాహృతా ॥
రాజవిద్యా రాజగుహ్య మధ్యాత్మజ్ఞాన ముత్తమం ।
జ్ఞాత్వా రాఘువ రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః ॥

(యోగవాసిష్ఠము, 2 భా. 11 అధ్యా - 3 -18 )


కాలక్రమమున ఆహారావశ్యకత అధికము కానుకాను భూవ్యవసాయమందు కాలము అధికముగా గడపవలసి వచ్చినందున కలహములు, కడుపుమంటలు, కొట్లాటలు, ఘాతలు కలుగుచు వచ్చినందునను కాలదోషములైన ఎండ, గాలి, వాన, చలి మొదలగు బాధలు కలుగుచు వచ్చినందునను రాజులు తమ దేశములయెల్లలకు వెలుపటినుండి తమ ప్రజలకు కలుగుచుండిన శ్రమలను యుద్ధములు లేక నివారించుటకు అశక్తులైరి. తమ రాజ్యములలోనే తమ ప్రజలలో పరస్పరవైషమ్యములను దండన వినాగా నివారించుటకు వీలు లేకపోయెను. కాబట్టి రాజులును ప్రజలును దైన్యముజెందిరి. అట్టి సందర్భమందు మేము రాజులకును ప్రజలకును ధర్మములనుపదేశించి జ్ఞానవంతులనుగా చేసితిమి. ఆ యుపదేశమునకు అధ్యాత్మవిద్య యని పేరు. దానినే రాజవిద్య, రాజగుహ్యమందురు. (ఇది వసిష్ఠులవారు చెప్పినది.)