Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఆత్మవిచారము

[4 వ

ఈ పుస్తకమునందు 4 వ పుటలో మరీచ్యాది ఋషుల గుండా ప్రవృత్తిధర్మము నుపదేశింపించి సనకాదులగుండా నివృత్తి ధర్మము అను మోక్షోపాయమును పరమకారుణికుడైన భగవంతుడు మనుష్యుల శ్రేయః ప్రాప్తికొరకు కలిగించినారని చదివినాము. ఇపుడు చెప్పినయాజ్ఞవల్క్యస్మృతిలోని శ్లోకములవల్ల మనకు నిదర్శనములగా మునీశ్వరసంఘమున్నదని తెలిసినది. సృష్టికర్త యైన బ్రహ్మదేవుడు తాను సృష్టించిన లోకములయొక్కయు అందలి ప్రజలయొక్కయు యోగక్షేమముల నుద్దేశించి ఇంతకన్న నధికమైన ప్రయత్నములను చేసియున్నారు. ఎట్లనగా


తతో మా మీశ్వరః సృష్ట్వా జ్ఞానే నాయోజ్య చాసకృత్ ।
విససర్జ మహాపీఠం లోకస్యాజ్ఞానశాంతయే ॥
యథా హం ప్రహిత స్తేన తథా స్యేచ మహర్షయః ।
సనత్కుమార ప్రముఖా నారదాద్యాశ్చ భూరిశః ॥


వసిష్ఠులవారు శ్రీరాములతో చెప్పుచున్నారు: - లోకములను ప్రజలను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి అమితజ్ఞానమును నాకు ఇచ్చి నన్నును నారదాదులైన ఋషులనును శ్రీసనత్కుమారులవారి అధికారమునకు లోబరిచి ప్రజలజ్ఞాన ప్రాప్తికొరకు భూలోకమునకు పంపిరి. ఇంతేకాక శ్రీసనత్కుమారులవారు మార్గప్రదర్శకసంఘము అను మహాపీఠమునకు అధిపతియై, శంబళగ్రామమునందున్నట్టును ఈ లోకమునందు రాజ్యమేలురాజులు జ్ఞానదానముచేయు గురువులందరును వారియంశాం లనియును తెలియనగు.