అధ్యా 4]
మానుష్యం
97
ములను అనుభవించి ప్రవృత్తిమార్గయాత్ర ముగించిన పిదప నివృత్తిమార్గయాత్ర నారంభించుటకు కావలసిన సంగతుల నంతయు ప్రజలకు తెలియపరచునట్టు శ్రీస్వాయంభువమనువుగారు ధర్మశాస్త్రమును వ్రాసిరి. ఈ శాస్త్రమునకు మనుధర్మశాస్త్రమని పేరు. ఇట్లు వ్రాసిన శాస్త్రము నందలి నిబంధనలను అనుష్ఠించి యితరులు అనుష్ఠించుటకు నిదర్శనముగా ప్రవృత్తిమార్గప్రవీణులైనటువంటి గృహస్థులనును, నివృత్తిమార్గప్రవీణులై నటువంటి నైష్ఠికబ్రహ్మచారులనును స్వాయంభువమనువు ఒకస్థలమందు చేర్చి యుంచియున్నారు.
తత్రాష్టాశీతి సాహస్రా మునయో గృహమేధినాం ।
పునరావర్తినో బీజభూతాః ధర్మప్రవర్తకాః ॥
సప్తర్షి నాకవీథ్యంతర్దేవలోకం సమాశ్రితాః ।
తానంత ఏవ మునయః సర్వారంభవివర్జితాః ॥
తపసా బ్రహ్మచర్యేణ సంగత్యాగేన మేధయా ।
తత్ర గత్వా పతిష్ఠంతే యాన దాభూతసంఫ్లువం ॥
యతో వేదాః పురాణాని విద్యోపనిషద స్తథా ।
శ్లోకాః సూత్రాణి భాష్యాణి యచ్చ కించన వాఙ్మయం ॥
వేదానువచనం యజ్ఞో బ్రహ్మచర్యం తతో దమః ।
శ్రద్ధోపవాసశ్చ తథా స్వాత్మనో జ్ఞానహేతవః ॥
(యాజ్ఞవల్క్య స్మృతి)
ఇట్టి మునీశ్వరసంఘమునుండియే అన్ని శాస్త్రములును వేదములును భాష్యాదులును మనుష్యుల యుపయోగార్థము వచ్చుచున్నవి. ఈ విధమున ఋషులకు మనుష్యుల మైన మనము ఋణగ్రస్తులము.