Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 4]

మానుష్యం

95

లకు ఆహారము ఆవాసము మొదలగునవి సంపాదించుకొనుటకు శక్తిలేని కాలమందు అనేక దేవతలు ఋషులు పితృదేవతలును సహాయులు గానుండిరి. కనుక మనుష్యులు కొంతమట్టుకు దేవతలకు ఋషులకు పితృదేవతలకు ఋణస్థులు అయిరి. ఈ మూడు ఋణములనును ఉత్తరోత్తర మనుజులు తీర్చుకోవలెను. వీరికి మహాపీఠము అనియు పేరు. వీరిలో

స్వాయంభువమనువు

మొదటివారు. వారి తరువాత పృథుచక్రవర్తి మొదలగువారు. ఈ తరగతి మార్గప్రదర్శకులు మనుష్యుల దేహసౌఖ్యములకుగా ముఖ్యముగా శ్రమపుచ్చుకొనినవారు. పూర్వాధ్యాయాంతమందు మనుష్యులు తేనెలనిచ్చు వృక్షములవల్ల జీవించుచుండిరనియు జనసముదాయముయొక్క ఉపయోగార్థముగా దేవతలచే నియ్యబడిన ఆ వృక్షములను కొందరు ఆక్రమించు కొనిరనియు ఆ పాపఫలముగా ఆ వృక్షములు మాసిపోయెననియు చదివితిమి.


నష్టేషు మధునా సార్థం కల్పవృక్షే ష్వ శేషతః ।
విషాదవ్యాకులా స్తా వై ప్రజా స్తృష్ణాక్షుధా ర్దితాః ॥
తాసాం వృష్ట్యుదకా నిహ యాని నిమ్నగతానివై ।
వృష్ట్యావరుద్ధై రభవన్ స్రోతః ఖాతాని నిమ్నగాః ॥


అట్లు మాసిపోయిన వృక్షములను చూచి ప్రజలు దుఃఖించిరనియు అపుడు వర్షములు కురియుట కారంభిచెననియు అనేక విధములైన ధాన్యములు స్వధాగా భూమిలో ఫలించెననియును ఏళ్లు కాలువలు