94
ఆత్మవిచారము
[4 వ
జనసముదాయమునందు శూద్రుని ధర్మము పరిచర్య. అట్లే ఒక మనుజునియందు బ్రహ్మచర్యముయొక్క ముఖ్యధర్మము పరిచర్య. జనసమూహమందు వైశ్యుడు భూమియందు పయిర్లు పెట్టి పెంచి యితరులకు ఆహారద్రవ్యముల నిచ్చి వారలను కాపాడును. అట్లు గార్హస్థ్యమందు మనుజుడు ఇతర ఆశ్రమములవారలను ఆహారద్రవ్యముల నిచ్చి కాపాడును.
జనసమూహమందు బ్రాహ్మణుడు తాను విరక్తుడై ఇతరులకు చదువు చెప్పి తెలివిని యిచ్చు విధమున ఆశ్రమముల యందు సంన్యాసి విరక్తుడై యితరులకు జ్ఞానదానము జేయును. ఇవ్విధంబున వర్ణాశ్రమధర్మములు లోకమందు పరస్పరోపకారులగా నుండుటయే కాక జీవాత్మలవృద్ధికి గారణమై యుండును.
ఈ వర్ణాశ్రమధర్మములను మరికొంత జాగ్రతగా పరిశీలించి చూచితే స్వార్థకములు కొన్నియు పారమార్థికములు కొన్నియుగానున్నవి. అనగా ధర్మము అర్థము కామము అనునవి స్వార్థకము గానును మోక్షము అనునది పారమార్థికముగానును ఉన్నవి. స్వార్థపరిశ్రమమునకు ప్రవృత్తిమార్గము అనియును పారమార్థికపరిశ్రమము, (పరార్థపరిశ్రమము) వీట్లకు నివృత్తిమార్గము అనియును పేళ్లు. ద్వితీయాధ్యాయము చివరను ప్రవృత్తి నివృత్తిమార్గములు అను పదములను ప్రస్తావించితిమి. ప్రవృత్తిమార్గము నివృత్తిమార్గము వీట్లును గురించి ఇకముందు వ్రాతుము.
మార్గప్రదర్శకులు
అనగా మార్గమును చూపువారు. క్రొత్తగా పశ్వాదుల శరీరములను వదిలి మానవశరీరములయందు ప్రవేశించిన మనుష్య