ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నాలుగవయధ్యాయము
లబ్ధ్వా సుదుర్లభ మిదం బహుసంభవాంతే
మానుష్య మర్థదం అనిత్య మపీ హ ధీరః ।
తూర్ణం యతేత నపతే దనుమృత్యు యావత్
నిశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్ ॥
మానుష్యం
ధాతువర్గతరుగుల్మలతామృగాది వ్యక్తులందు అనేక లక్షల జన్మంబులు ఎత్తినపిదప సంపాదింపబడిన మనుష్యజన్మము అతి దుర్లభము. "బహుసంభవాంతే” అనేకజన్మములకు తరువాత యని యర్థము. ఇట్టి దుర్లభమగు మనుష్యశరీరమునందు పరమలాభ మొకటి యున్నది. అది అనగా మనస్సు. "బ్రహ్మావలోకధిషణం" అని 53 వ పుటలో నచ్చుపడియుండు శ్లోకమందున్నది. కనుక మానవజన్మంబునకు పరమార్థంబు బ్రహ్మావలోకనంబే. అట్టి పరమార్థోద్దేశము కలిగిన మానవజన్మ మెత్తితిమి. ఇది "అర్థదం” పురుషార్థములను సంపాదించి యియ్యగలది. అయితే ”అనిత్యం" చాలకాలముండునది కాదు. రోగములు