Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఆత్మవిచారము

[3 వ

వదులుటవల్ల నొక్కొక తైజసవైశ్వానరాత్మయు తనయొక్క ఆదిపురుషుడైన ప్రాజ్ఞాత్మతో కలిసెననియును, అట్టికలియుట మొదలు నిక ముందు సంజ్ఞార్థము "జీవాత్మ” యని యీ పుస్తకమునందు వాడనగుననియు, నట్లు ఏర్పడిన జీవాత్మ మనుష్యశరీరవాసియైనను అప్పుడే పుట్టిన శిశువువలె పరాధీనుడై యితరుల సహాయమువల్లనే కృతయుగమంతయు జీవించుచుండెననియు, ఋషులు, దేవతలు, పితృదేవతలు మొదలగువారు ఈ శిశుప్రజాసమూహంబునకు కృతయుగమంతయు సహాయులై యుండిరనియు, మానవకోటియంతయు అండజంబులుగను, స్వేదజంబులుగను, స్త్రీపురుషభేద మేర్పడని శరీరంబులలో వసించియుండిరనియు, కాలాంతరమందు ఆ శరీరంబులు ఒక్కొకటిలోనును స్త్రీత్వ పురుషత్వ చిహ్నంబులు కలిసియుండెననియు, మరల కాలాంతరేణ స్త్రీలు పురుషులు అనుభేదంబులు వ్యక్తములయ్యెననియు, తరువాత త్రేతాయుగారంభమందు అనురాగముత్పత్తియయి స్త్రీశరీరంబులకు రజస్వలాస్థితి కలిగి యిప్పటికాలమందు ప్రజావృద్ధియగు విధానమున కారంభము అయినదనియును మొదలుగాగల విషయములు సంగ్రహముగా వివరింపబడెను. ఇక ముందు మానవశరీరధారులై అహంకార మమకారాన్వితులై ద్వంద్వాదిదోషఘాతులైన మానవశరీరవాసులైన జీవాత్మలు తమ స్వస్వరూపానుసంధానము బడయ చేయు ప్రయత్నములనుగురించి వ్రాయబడును.