Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఆత్మవిచారము

[3 వ

అప్పటివరకును మనుష్యులకు ద్వంద్వములవలని బాధ లేకుండెను. రుగ్మతలు గాని విపత్తులుగాని లేకుండెను. పుట్టిన బిడ్డలను కాపాడవలసిన అవశ్యము లేక తమంతటివార్లనే బిడ్డలుగా మనశ్శక్తివల్ల పొందుచుండిరి. గాలిలోనుండి ఆహారప్రత్యామ్నాయమైన తృప్తియే కలుగుచుండెను. ఇట్లు సుఖముగానుండిన మానవకోటికి మరణము అను అవస్థయు సకలానర్థమూలమైన స్త్రీపురుషభేదములును కలిగెను. మరణ మెట్లు సందర్శించె ననగా పరమేశ్వరుడు ఎవరికి మరణము కలుగవలెనని విధించిరో అట్టి వారికి గాలిలోనుండి దేహధారణశక్తిగల సారమును గ్రహించు శక్తి నిలిచిపోయెను. శక్తిగ్రాహకశక్తి అను సిద్ధి నిలిచిపోయినపుడు మరణము కలిగెను.


తాసు సర్వాసు నష్టాసు నభసః ప్రచ్యుతా రసాః ।
పయసః కల్పవృక్షాప్తె సంభూతా గృహసంస్థితాః ॥
సర్వప్రత్యుపభోగాశ్చ తాసాం తేభ్యః ప్రజాయత ।
వర్తయంతి స్మతేభ్య స్తాః త్రేతాయుగముఖే తదా ॥

(మార్కండేయ పురాణము)


కృతయుగాంతమువరకును గాలినుండి ఆహారమాకర్షించి జీవించి విపత్తులు రోగములు మొదలగు దుఃఖములు లేక యుండిన ప్రజలకు త్రేతాయుగప్రారంభము కాగానే ఆహారాకర్షణసిద్ధిని దేవతలు ఇచ్చుటను నిలిపిరి. ఇట్లు ప్రజలకు కొంతకొంతగా దుఃఖములను కలుగజేసి వారిని కలియుగమునందు మనవంటివారల మనుభవించు దుఃఖముల ననుభవించుటకు క్రమక్రమముగా శక్తిపొందునట్టు చేసిరి. పూర్వపుశక్తులు మాసిపోయినపుడు ఆకాశమునుండి