అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
85
ఇపుడు పక్షిజాతులు గుడ్లుపెట్టితే కొన్ని వారములలోపల పిల్లలు గానెదుగును. పూర్వకాలపు గుడ్లు పిల్లలగా నెదుగుటకు కొన్ని సంవత్సరములకాలము చెల్లును. శ్రీమహాభారతాదిపర్వమునందు శ్రీగరుత్మంతుని జన్మకథ వర్ణించుకాలమందు కశ్యపమహర్షిభార్యలు ఇద్దరికిని ఒక వైషమ్యము కలిగి ఒకతెకు మరియొకతె బానిసయైనదనియును అట్లు బానిసయైన భార్యపేరు వినతయనియును ఆమె తన భర్తనాశ్రయించి తన బానిసతన మెట్లు వదులును అని అడుగుకొనెననియును అందు కతడు ఒక వరమిచ్చెననియును చెప్పియున్నది. ఆ వరముయొక్క వివరము ఏమనగా వినత అప్పటికి ఇడియుండిన రెండుగుడ్లును ఎదిగినట్టైతే అందులో నొక మహానుభావుడు జన్మించి అతనివల్ల బానిసతనము మాను ననియు చెప్పినట్టున్నది. వినతాదేవి బానిసగానుండి విసికి విసికి అనేక సంవత్సరములయిన పిమ్మట నొక నాడు తనయొక్క గుడ్లు రెండును అదివరకును ఎదగక పోయినందున మరికొంతకాలము కాచియుండుటకు ఓర్పు లేక ఒక గుడ్డును మెల్లగా పగల దీసెను. అంత నా గుడ్డునుండి వెలువడినవారి పేరు అనూరుడు. అనూరుడు అనగా తొడలు లేనివాడు. ఎందువల్ల తొడలు లేవంటే గుడ్డు చాలినంతకాలము ముదరకపోయినందున దేహము నడుము వరకునే ఏర్పడినది అని అర్థము. ఈ కథ నెందుకు చెప్పవలసివచ్చె నన వచ్చును. పైన చెప్పిన ప్రకారము మానవులు గుడ్లు పెట్టిరనియు ఆ గుడ్లు ఎదుగుటకు అనేక సంవత్సరములు కావలెనని చెప్పిన దానికి ఉదాహరణముగా చెప్పబడెను.