84
ఆత్మవిచారము
[3 వ
రపుడు ఇలాసుద్యుమ్నయొక్క ప్రజ యనియును వాలిసుగ్రీవులు ఋక్షరాజుయొక్క ప్రజ యనియును చదువుచున్నాము కదా. ఇలాసుద్యుమ్న శరీరము సగము మగ, సగము ఆడుది.
న తాసాం ప్రతిఘాతోస్తి న ద్వేషో నాపి మత్సరః ।
సర్వతోదధిసేవిన్యో హ్యనికేతాస్తు సర్వశః ॥
తా నై నిష్కామచారిణ్యో నిత్యం ముదితమానసాః ।
కాలేన గచ్ఛతానాశ ముపయాంతి యథా ప్రజాః ॥
తథా తాః క్రమశో నాశం జగ్ముః సర్వత్ర సిద్ధయః ।
ఆయుషోస్తే ప్రసూయస్తే మిథువాన్యేవ తాః సకృత్ ॥
గులికం గులికా చైవ ఉత్పద్యన్తే ముమూర్ష తాం !
తతః ప్రభృతి కల్పె స్మిన్ మిథునానాం హి సంభవః ॥
(మార్కండేయపురాణం)
వారలకు ద్వేషాది దుర్బుద్ధులు గాని కామక్రోధోద్భవ మైన వేగము గాని లేక యెల్లప్పుడును సంతోషముతో నుండిరి. కొండలు, గుహలు ఇట్టి స్థలములయందు నివసించుచుండిరి. ఇండ్లు ఏర్పడలేదు. సమశీతోష్ణముగా నుండినందున ఆవశ్యకత కనబడలేదు. మరణకాలము సమీపించినపుడు పక్షులు అండములు పెట్టినట్టు మనుష్యులు గుడ్లు పెట్టుచుండిరి. అవి కొంతకాలమునకు అనగా అనేక సంవత్సరములకు తరువాత పిల్లలయి మగపిల్లనో ఆడుపిల్లనో కలిగించును. ఈ శ్వేతవరాహకల్పమందు స్త్రీపురుష భేద మేర్పడినది ఇదియే మొదలు. ఆడపిల్లగా తేరితే ఆ శరీరమందు మగవాని గుర్తులు కొన్నియుండును. మగపిల్లగా తేరితే స్త్రీచిహ్నములు కూడ అదే శరీరమందు కొన్ని యుండును. ఇట్లు కొంతకాలము అనగా కొన్ని లక్షలసంవత్సరముల కాలము జరుగుచుండెను.