అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
81
ఎక్కడచూచినను జలార్ణవముగా నుండునట. మరల కల్పాదియందు జలము కొంచెము కొంచెముగా తగ్గి అడుసురూపముగాను చెట్లుచేమలు వృక్షములు మృగములు మనుష్యులు నివసించుటకు వీలు లేక అడుసుమయముగా నుండినదట. సూర్యరశ్మి వాయువు ఇటువంటివి కొంతమట్టుకు అడుసును గట్టిపరిచి భూమియొక్క రూపమును కలుగచేసెనట.
క్వచిత్ క్వచిత్ పునః సా౽భూత్ క్షితి ర్భాగేన సర్వశః ।
సరిత్సరః సముద్రాంశ్చ సేవస్తే పర్వతానపి ॥
(మార్కండేయపురాణము)
అచ్చటచ్చట మరల గట్టిభూమి అగుపడెను. అన్నిచోట్ల అగుపడలేదు. కొలనులు, కాలువలు, కొండలు, సముద్రములు గా నేర్పడినది.
ఆ కాలమందు ఋతుభేదములు లేవు. అన్ని ఋతువులు అనగా సంవత్సరము ఆదినుండి అంత్యమువరకును సమశీతోష్ణముగానుండెను. అట్టి స్థితి ఆహ్లాదకరముగా నుండెను. చెట్లు చేమలు గుట్టలు ఫలములు పుష్పములు గాని లేవు. అట్టి స్థితి యందు మనుష్యులకు ఆహారమునకు బదులు వెలుపలి గాలినుండి ఒక విధమైన తృప్తి కలుగుచుండినది.
స మూలఫలపుష్పాణి నర్తవో వత్సరాణిచ ।
సర్వకాలసుఖః కాలో నాత్యర్థం ఘర్మశీతతా ॥
తత శ్చ తేషాం పూర్వాహ్ణే మధ్యాహ్నే చ వితృప్తతా ।
పున స్తథేచ్ఛతాం తృప్తి రనాయాసేవ సా౽భవత్ ॥
(మార్కండేయపురాణము)