పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఆంధ్రనామసంగ్రహము

దేవవర్గు

అవతారిక

పైఁడిపాటి లక్ష్మణకవిమంత్రి యాంధ్రనామసంగ్రహమనెడి యీనిఘంటువును రచియింపఁబూని యిది నిర్విఘ్నముగా పరిసమాప్తినొందుటకొఱకు నాదియందు నిష్టదేవతానమస్కారరూపమంగళము నాచరించువాఁడై యి ట్లాచరించుట శిష్టాచారమని శిష్యజనులకుఁ దెలియుటకొఱకు నామంగళమును గ్రంథరూపముగా 'శ్రీపతివంద్యు' అను తొలుపద్యమున నిబంధించుచున్నాఁడు. పిదప రెండుపద్యములందును దనయిష్టదైవమగు విశ్వనాథునికి స్తుతిపూర్వకముగా నీగ్రంథము నంకితము సేయుటయు, గ్రంథనామము స్వనామము మున్నగునవియుఁ దెలుపుచున్నాఁడు. మొదటి [1]మూఁడుపద్యములు నేకాన్వయము గలవియని యెఱుంగునది.

క.

శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్టసిద్ధులు వరుసన్
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱిఁగి చెందిన వేడ్కన్.

1


తే.

నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాతరంగితమతికిన్

  1. ఇట్లు ఏకాన్వయముగల పద్యములు కుళక మనఁబడును. కావ్యాదులందుఁ గుళకముఁ జెప్పువాడుక తఱచుగాఁ గానంబడుచున్నది.