పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాధనములకును, హఠ కర్మ సాంఖ్య లయ రాజయో గములకును 'హిందూస్థానము జన్మస్థానము. చిరకాల సం వర్ధితమైన వైదిక సంస్కారమును మహర్షులు భక్తి కర్మ జ్ఞాన యోగములందును, శ్రీ కృష్ణుడు పూర్ణ యోగము నందను, బుద్ధదేవుడు ధర్మయోగమునందును, శంకర రామానుజాదులు వేదాంత యోగమునందును, శాక్తే యులు ఇచ్ఛాజ్ఞాన క్రియాయోగములందును, సమన్వయ ముచేసిన విధమున నీ వర్తమాన యుగమునందును రామ కృష్ణపరమహంస వివేకానందస్వామి తిలకు గాంధి రామను బోసు మొదలగు మహానుభావులును భక్తి జ్ఞాన వైరాగ్య కర్మయోగములందు లగ్నముచేయుచు విజ్ఞాన విజయమును పరిస్ఫుటము చేయుచున్నారు. మతవ్యాప నమునందువలె శాస్త్రకళావ్యాపనమునందును ప్రాచీన కాలమునందు హిందూస్థాన మగ్రస్థానము వహించినది. ప్రాచీన సంస్కారము వర్తమానకాలమునందును పున రుద్ధృతమై వికసించుచున్న విధమును దేశావృతమైన మహాప్రబోధము విశదము చేయుచున్నది. విజ్ఞాన ప్రస్థానమునందు కళలు, శాస్త్రములు, ధర్మములు, మతములు దేశ కాల పాత్రాధారమున వర్ధిల్లినను విజ్ఞానము దేశ కాల పాత్రావరణముల కతీతమై విశ్వవికాసమునకు సాధనముగ నున్నది. గణితము, జౌ జ్యోతి పము, పదార్థవిజ్ఞానము, శిల్పము, చిత్రలేఖనము, ఆ స్తిక వాదము, వేదాంతము మొదలగు శాస్త్ర కళా తత్త్వ ములు దేశకాల పాత్రాధారమున నిత్యమైన విజ్ఞానవిశాస మునకు వినియోగపడిన విధమును విజ్ఞాన సర్వస్వములు విశ దము చేయుచున్నవి. ప్రాచీన మైన వైదిక విజ్ఞానమునందు ప్రతిపాదితములైన జ్ఞాన బీజములు కాలక్రమమున వివిధ విజ్ఞానరూపములను ప్రవర్ధమానములై విజ్ఞానమహాఫల ములను సమకూర్చిన విధమును ప్రపం చేతిహాసములును, శాస్త్రములును, కళలును విశదము చేయు చున్నవి. వేదకాలమునందు యజ్ఞయాగాదుల నిర్వహణ యున్నకై వినియోగపడిన గణితము, శిల్పము, జ్యోతిషము, కర్మకాండము, ధర్మకాండము, జ్ఞానకాండము మానవా -భ్యుదయమునకై వినియోగపడిన విధమును వివిధ శాస్త్ర ములవిజ్ఞాన చరిత్రము విశదము చేయుచున్నది. మహర్షు లచే నాది కాలమున దేవతారాధనమునకు వినియో గించిన వృక్షమూలములు దివ్య దేవాలయ మందిర విహారాశ్రమ రూపమును దాల్చినవిధమును సాంచీ అమరావతీ విహారములు, అజంతా ఎల్లోరా గుహాలయ ములు, అబూ మీనాక్షీ దేవాలయములు, జూమా మసీదులు, సెయింటు పీటరు సెయింటు పాలు చర్చిలు మొదలగు సుందరని ర్మాణములు విశదము చేయుచున్న వి. మానవులు మట్టిదిబ్బలతో నారంభించిన సమాధులు దివ్యసుందరరూపములను దాల్చినవిధమును పిరమిడ్లు, స్తూపములు; తాజమహలు మొదలగు నందమయిన కట్టడములు విశదము చేయుచున్నవి. వేదములందు సూచితములైన ఋక్కులు నవరసభరితములైన కావ్య నాటకాది రూపములను దాల్చినవిధమును రామాయణ మహాభారతాది కావ్యములు విశదము చేయుచున్నవి. రాతిపనిముట్లతో నారంభమైన వ్యవసాయ గృహ పరి శ్రమలు సుఖదుఃఖ ప్రదమైన యంత్ర పరిశ్రమల రూప మును దాల్చిన విధము విజ్ఞాన కళాభ్యుదయమునం దొక మహాఘట్టముగ నున్నది. జలయంత్రములు, వాయుయంత్రములు, ఆవిరి యంత్రములు, నూనెయంత్రములు, విద్యుద్యంత్రములు, రేడియోయంత్రములు లలితాస్తోత్ర ప్రతిపాదితమయిన