పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకగణితము

ట = ౧; ఠ = ౨ ; డ = 3 ; ఢ - ౪; ణ = ౫ ;
త = ౧; థ = ౨ ; ధ = ౩ ; ధ = ౪ ; న = ౫ ;
ప = ౧ ; ఫ = ౨ ;బ = ౩  ; భ = ౪; మ = ౫ ;
య = ౧; ర = ౨ ; ల = 3; వ = ౪ ;
శ = ౫  ; హ = ౬; స = ౭ ; హ = ౮ ; ళ = ౯ .
ఇట్టి సంఖ్యాసం కేతము లుండుటవలన సార్థక ములగు పద్యములు వ్రాయుచు, సంఖ్యలను దెలుపవచ్చును. సంయుక్తాక్షరముల నుపయో గించునప్పుడు కడపట నుచ్చరించు అక్షరమునకే సాంకేతికాంకము చెందుచుండును. ఈరీతిని “విష్ణు" అను పదమునకు ముందు వివరింపం బోవు వామతో గతిసూత్రముననుసరించి ౫౪ అని గ్రహింపనగుమ <br వేళొక పద్ధతిని హ్రస్వాకారయుతములైన హల్లులు ౧ మొడలు వరుసగా 38 అంకెలకు సంకేతము లగును. ఇంతకంటెను పెద్దసంఖ్యల నుపయోగించునప్పుడు దీర్ఘాకారయుతముల నుపయోగింతురు. క = ౧; కా= ౩ ౫ ; ఖా=3౬ ఇత్యాదు లూహ్యంబులు. ఈపద్ధతి పదునైదన శతాబ్ది ప్రాంతమున జాతకములను, పంచాంగములను గుణించుటకుఁ దఱచుగ నుపయోగించెడివారు.<br మాటలవలన సంఖ్యలను తెలుపు
ఇది మిక్కిలి పురాతనమైన పద్ధతి, అచిరకాలముననే హిందూ దేశమునందంతటను వ్యాపించి యిప్పటికిని మనదేశమునం దంతటను వాడుకయందున్నది. మన దేశమున గణితశాస్త్ర గ్రంథములయం దేకాక యితరశాస్త్ర గ్రంథములయందుఁగూడ నీపరిభాషను వాడుచున్నారు. ఈపద్ధతి ననుసరించువారు సుప్రసిద్ధములగు పర్యాయపదముల చేత సంఖ్య లను దెలుపుదురు. ఇట్లు చంద్రుఁడు = ౧, అక్షి = ౨, మూర్తులు = 3, వేదములు = ౪ పాండవులు= ౫ , ఋతువులు =౬ ఋషులు= ౭ పసువులు = ౮ నందులు =౯ అవతారములు = ౧౦, రుద్రులు = ౧౧ , సూర్యుఁడు = ౧౨ అని అంక సంజ్ఞలు. భాషలో "అంకానాం వామతో గతిః" అనుసూ, శ్రీ మును బట్టి యంకె లను వ్రాయునప్పుడు ఎడమవైపుననుండి కుడివైపునకు సవ్యముగా వ్రాయక, కుడిపై పుననుండి యెడమవైపునకు నపస్యముగా వ్రాయ వలెను. = ఈ పరి

ఉదాహరణము:

క. 'భూ చంద్ర కరత్రయ భూ
తాచల వియ దబ్ధి వసు కరాష్ట శ్రీయ శూ న్యాచల గతి కర వసుధా సంఖ్య యని చెప్పినయెడల నీ క్రింది సంఖ్య యగును;
౧ ౨ ౩ ౭ ౦ ౩ ౮ ౨ ౮ ౪ ౧ ౭ ౫ ౩ ౨ ౧ ౧
/poem> క్రీస్తుశకము ఏడవ శతాబ్దిని తన బ్రహ్మస్ఫుటసిద్ధాంత మను జ్యోతిష గ్రంథమునందు బ్రహ్మగుప్తుఁడు ఇరువదియైదు సంఖ్యల వఱకును దెలుపుటకు నిట్టి పర్యాయపదముల నిచ్చియుండెను. పండ్రెండవ
శతాబ్దియందు వ్రాసిన భాస్కరాచార్యుఁడు తన సిద్ధాంత శిరోమణీ యను గ్రంథమునం దఱువది నాల్గు వఱకును గల యం కెలకు పారి భాషిక పదములఁ దెలిపియుండెను.
సంఖ్యలయందుఁ గల గురుత్వము
నాగరక ప్రపంచమునందలి ప్రాచీన జాతుల వారందఱును అంక ములను పవిత్ర భావముతో నాచరించుట యలవా టైయుం డెను. సంఖ్యలు దేవతాస్వరూపము లని కొందఱు, మనుష్యస్వరూపము లని కొందఱు, ప్రకృతిస్వరూపము లని మజీకొందఱు భావించుచుండిరి. సంఖ్యలు భాషాలిపివలెనే పర బ్రహ్మస్వరూప మని హిందువులు పవిత్ర భావ ముతో నెంచెదరు, హిందువులకు సంఖ్యలయెడలఁ గల గౌరవభావమును సూచించుటకు వారి సాంఖ్యతత్త్వమే గొప్ప నిదర్శనము. ఈ సాంఖ్య తత్త్వమునందు అక్కరములకును అంకెలకును మైత్రి గలపి భాషయం వలి ప్రతిమాటకును 'సోహము'తోఁగాని 'ఓం నమశ్శివాయ' యను మంత్రముతోఁ గాని గాని యైక్యమును గల్పించెదరు.
ఒకటి యన్ని జాతులవారికిని పవిత్రతమమైన సంఖ్య. ఇది పర మాత్మస్వరూప మనియు, తక్కిన సంఖ్య లన్నియు దీనియందుండి మూర్తీభవించిన వనియును ప్రతీతి. హిందువులలో నీసంఖ్య ప్రణవ చిహ్న ముగఁ బరిగణింపఁబడుచున్నది.
మూఁడు ఏడు లన్ని జాతుల వారికిని పవిత్రమైన సంఖ్యలుగా నెన్నఁబడుచున్నవి. శ్రీ మూర్తులు, ఆది మధ్యాంతములు మున్నగు శ్రీ సంజ్ఞావాచకములు మిక్కిలి పవిత్రములైనవి. ఏడు, మూఁటి కంటెను నెక్కుడు పవిత్రమైనది. ఈ సంఖ్యను దెలుపు పవిత్ర వాచ కము లనేకము లున్నవి. కాని “ఏడు" అను పదమునకు తెలుఁగున నున్న ద్వంద్వార్థమును బట్టి తెలుఁగువారు శుభకార్యములయం దీపం ఖ్యను వచించుటకు సయితము నెంతురు. ఏ డనుటకు "ఆఱునొకటి” యనునది పర్యాయపద మైనది. ఐదు, ఎనిమిది, తొమ్మదులుగూడ కొన్ని దేశములయందుఁ బవిత్ర ములుగ నెంచెదరు. హిందువులకు తొమ్మిది ముఖ్యమైన సంఖ్య.
ఇతర జాతులవారీలోవలెఁ గాక హిందువులలో పదికంటే నెక్కుడు సంఖ్యలందుఁ గూడ కొన్ని పవిత్రముగ పరిగణింపఁబడు చున్నవి. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, చతుర్ద శీమనువులు ఇవి యన్నియు మిక్కిలి పవిత్రమగునానుములు. చకుర్వేదములు, వశంగ ములు, అష్టవసువులు నుండుటచే నీ సంఖ్యలు హిందువులచే నితరజాతు లలో కంటె ముఖ్యముగ భావింపఁబడుచున్నవి. హృదయరంజక మగు సంగీతశాస్త్రమునకు సప్తస్వరము లునికి పట్టగుటను బట్టి ఏడు అన్ని దేశ ములను ముఖ్యమైన యంగా నెన్న ఁబడుచున్నది "ఏడు" అను సంఖ్యాకల్పన - 'మొట్టమొదట ౪ ,3 కలుపుటవలన కలిగినది. కాని ౫ , ౨ కాని, ౬, ౧ కాని కలుపుటవలనఁ గలుగ లేదని గణితశాస్త్రజ్ఞుల యభి ప్రాయము. ఇందునకు నిదర్శనముగ వేదమునందు నాలుగు స్వరము లున్నవి. సంగీతశాస్త్రమున సప్తస్వరము లున్నవి. ఈ రెంటికిని