పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంహారమునకును వినియోగపడుచున్నది. పాశ్చాత్త్య సంస్కారవిజృంభణము ప్రాచ్యసంస్కారమును స్తంభింప జేసినది. క్రైస్తవమత ప్రచారము, పాశ్చాత్త్యపరిశ్రమ వ్యాపార విజృంభణము, మారణ యంత్ర సాధనములు ప్రపంచ ప్రవృత్తియందు సుఖదుఃఖపరివర్తనమును గలుగ జెసినవి పూర్వయుగములందు మానవధరాభ్యుదయము నకు వినియోగపడిన ప్రాచ్యసంస్కారము నేటి భౌతికశా స్త్రావరణమునందు నిర్వీర్యమైన విధమును భారతీయ విజ్ఞా నోదంతము విస్పష్టము చేయుచున్నది. సనాతనమైన భారతీయ విజ్ఞాన ప్రవాహమున కాటంకములును, అంత రాయములును అది యప్రతిహతముగ ప్రవహించుచు విజ్ఞానవికాసావశ్యకతను విశదముచేయు చున్న ది.చిర కాలానుగతమును, సత్త్వోపేతమునునైన భార తీయవిజ్ఞానము వ ర్తమానయుగమునందును యుగధర్మాను కూలముగ భారతవర్షాభ్యుదయమునకును, విశ్వకల్యాణ మునకును వినియోగపడుట ప్రకృతిధర్మము. విశ్వవిజ్ఞాన మూర్తికి ప్రాచీన కాలమునం దన తార మూర్తులు, మహ ర్షులు, రాజర్షులు, శాస్త్రజ్ఞులు, కర్మకళోపాసకులు విజ్ఞా నాభ్యుదయము కొఱకు దీపాంజలుల నర్పించినరీతిని వర్త మాన కాలమునందును దయానందుడు, రామకృష్ణుడు, రామమోహనుడు, జగదీశ్ చంద్ర బోసు, ప్రఫుల్ల చంద్ర రాయి, రాధాకృష్ణుఁడు, వేంకట రామను, విశ్వేశ్వరయ్య, వీరేశలింగము, తిలకు, గాంధి మొదలగు మహానుభావులు విశ్వవికాసమునకు విజ్ఞానదీపాంజలుల నర్పించుచున్నారు. ప్రంపంచము నందు దుఖనివృత్తియును, సుఖ ప్రాప్తియును జీవయాత్రకు ఫలము. దుఃఖనివృత్తికిని సుఖ ప్రాప్తికిని ఆజ్ఞానవినాశమును, విజ్ఞానోపార్జనమును సాధనములు. ప్రాచ్యపాశ్చాత్య సంస్కారములు, జ్ఞాన కర్మయోగములు, ' భావభౌతిక ప్రవృత్తులు, శాస్త్రకళా నిర్మాణములు దుఃఖనివృత్తికిని సుఖ ప్రాప్తి కిని విజ్ఞానో పార్జన మును జేసినవిధమును విజ్ఞాన సర్వస్వము ప్రత్యక్షము చేయుచున్నది. పురుషార్థసిద్ధికి వ్యక్తులు, కుటుంబములు, కులములు, సంఘములు, జాతులు సమకూర్చిన జ్ఞాన బీజ ములు మాన వధ రాభ్యుదయమునకు సాధన భూతములుగ నున్నవి విజ్ఞాన సాధ్య మైన ధర్మార్థ కామమోక్ష సామ్రా జ్యము నధిష్ఠించుటకు సకలచరాచర ప్రపంచము విజ్ఞాన ప్రస్థానము చేయుచున్నది. ఈ విశ్వవిజ్ఞాన ప్రస్థానమునందు సమానాధిక రణసాధన లభ్యమైన ప్రాచ్యవిజ్ఞానమును, వ్యధి కరణమార్గలభ్యమైన పాశ్చాత్త్యవిజ్ఞానమును మానవధర్మ కైంకర్యమునకై ఆత్మయోగాభ్యాసమును చేసిన విధమును విశ్వవిజ్ఞాన చరిత్రము విశదము చేయుచున్నది.. అనంత మైన విశ్వవిజ్ఞాన సామ్రాజ్యానుభవము సకలమానవుల కును సాధ్యము. సాధ్యమైన విజ్ఞానామృతాపోశనమునకు సకల జనులను, సాధకులను, అర్హులను అధి కారులనుగా చేయుట విజ్ఞాన సర్వస్వములకు పరమార్థము. ఈ పర మార్థమును దేశకాల పాత్రావరణబద్ధమైనను దేశకాల పాత్రావరణాతీతుడైన శాంత శివసుందరవిజ్ఞానమూర్తి విజ్ఞా నోపాసకుల కనుగ్రహించును. విజ్ఞానోపాసకులు విజ్ఞానా మృతాపోశనమును చేసి . విజ్ఞాన బృందావనమునందు బ్రహ్మానందము ననుభవించుట కధికారులు. దుర్ల భ మైన బ్రహ్మాధికారము విజ్ఞానసంపన్నులకు సాధ్యము. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును శ్రీయుత .కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు వారిముఖ్యసంపాదకత్వము క్రింద నిరువదేండ్లకు పూర్వము ప్రారంభించిరి. ప్రథమసంపు టము ౧౯౧౫-వ సంవత్సరమునందును, రెండు మూడు