పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాశక్తి మానవధరాభ్యుదయమునకు వినియోగపడ గలవిధమును విశదము చేయుచున్నవి. పొగయోడ, ధూమశకటము, మోటారు, మెఱపుబండి, విమానము, టెలిఫోను, టెలిగ్రాము, వాయువార్త, టెలివిజను, ఫోటోటోను, గ్రామొఫోను మొదలగు ననంతములైన నవీన యంత్ర నిర్మాణములు మానవుల సృష్టిసామర్థ్య మును నిరూపించుచున్నవి. కర్మ శాస్త్ర కళా విజ్ఞానా భ్యుదయము మానవధరాభ్యుదయమున కుత్తేజముకు గలుగ జేసినది. శారీరక శాస్త్రము, జీవశాస్త్రము, మాన సికశాస్త్రము, ఆధ్యాత్మికశాస్త్రము మొదలగు శాస్త్ర ముల విజ్ఞానము పరమాణువునకును, పర బ్రహ్మమునకును గల యేకాంతస్వభావమును విశదము చేయుచున్నవి. విజ్ఞానోదయ మజ్ఞాన సంవర్ధితంబు లైన పూర్వా చారములను శిథిలము చేయుచున్నది. చిర కాలసంవర్ధి తంబులైన యభిమానాజ్ఞానావరణములు నిరర్థకములైనవి; మానవధర్యావరణము సార్థక మగుచున్నది. మానవ ధర్మావరణ సంస్థాపనమునకు సంకుచితములైన యధికారా వరణము, కులావరణము, బలావరణము, ధనావరణము, మతావరణము, విద్యావరణము, జాతీయాద్యభిమానా వరణములు నిరుపయోగములై విశాలమైన విశ్వమానవ ధర్మ సంఘావరణ ముద్భవించినది. విశ్వవిజ్ఞాన మాతోప లబ్ధికిని, విశ్వసాంఘిక ధర్మోపలబ్ధికిని సాధనభూత మగు చున్నది. విజ్ఞానము పశుప్రవృత్తిని మానవ ప్రవృత్తి కిని, మానవ ప్రవృత్తిని దైవప్రవృత్తికిని, దైవప్రవృత్తిని బ్రహ్మప్రవృత్తికిని మరల్చుటకు వినియోగపడుచున్నది. ఆత్మోపలబ్ధిపరమైన ప్రాచ్య విజ్ఞానమును, బాహ్యో లబ్ధిపరమైన పాశ్చాత్యవిజ్ఞానమును నేకాంత మైన విశ్వమానవ ధర్మ సంఘానరణమునందు సార్థకము లగు చున్నవి. సనాతనమైన వైదిక విజ్ఞాన మీపరమార్థ మును “ అహం బ్రహ్మాస్మి”, “సర్వం ఖల్విదం బ్రహ్మ” ఇత్యాది మహా వాక్యములందు ప్రతిపాదించినది. పాశ్చాత్త విజ్ఞానము విశ్వమానవకల్యాణమునకయి సనాతన మైన “తత్త్వమసి " ధర్మమునకు సకలజనుల నధికారులను జేసి, సార్థకమగుటకు ప్రయత్నించుచున్నది. రస్సెల, వెల్సు మొదలగు పాశ్చాత్త్య విజ్ఞానోపాసకులు బాహ్యోపలబ్ధికరమైన విజ్ఞానము ఆత్మోపలబ్ధిపరము గావలసిన విధమును బోధించుచున్నారు. వివిధ విజ్ఞాన సంయోగ సంజాతమైన ఏకాంత యోగమును సమర్థించు టకు విశ్వవిజ్ఞానము వినియోగ పడుచున్నది. విజ్ఞానవికాసమునందు "దేశ కాలపా ప్రభావ మప్రతిహతకు ప్రాచ్యసంస్కార వికాసము నందు భావప్రవృత్తియును, పాశ్చాత్యసంస్కా రవికా సమునందు భౌతిక ప్రవృత్తియును బలీయముగ విజ్ఞానవికా సమున కుపయోగపడినవి. ప్రాచ్యసంస్కారము భావ ప్రవృత్తిపరమైన వైదిక జైన బౌద్ధ క్రైస్తవ మహమ్మ యా మత విజ్ఞాన రూపమున పరిణమించినది. పాశ్చాత్త్యసంస్కారము సుందర శాస్త్ర కళా రూప ప్రవృత్తిపరమైన భౌతిక విజ్ఞాన రూపమున పరిణమించినది. ప్రాచ్యసంస్కారసంభవమైన క్రైస్తవమతము పాశ్చాత్య సంస్కార క్షేత్ర మునందు నూతనరూపమును దాల్చినది. యవన రోమక సంస్కారాధారమున వర్ధిల్లిన పాశ్చాత్త్య సంస్కారము భావపోషణముతో భౌతిక సస్యములను సమకూర్చినది. శాస్త్రపరిజ్ఞాన మాత్మ విజయమునకుఁ మాత్మవిజయమునకుఁ గాక భౌతిక విజయమునకు వినియోగపడినది. పాశ్చాత్త్య సంస్కారము ప్రపంచవికాసమున కువ లె ప్రపంచ