పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యశ్మక, మూలకుల చరిత్ర పురాణములన్నిటి యందును గలదు. పురాణములలో చెప్పబడిన ప్రాచీనచరిత్రయందు గల అశ్మక, మూలకులను రాజులపేర్లను తీసికొని అశ్మకులు మూలకులు అని రెండు బాహ్యజాతులున్నట్లు అభూతకల్పన చేసి పాశ్చాత్య చరిత్రకారులు వారిని గోదావరీతీరమునకు దెచ్చి యిచ్చట 'అంధ్రజాతి'కి మూలపురుషు లని కల్పించి చెప్పుచు ఆంధ్రజాతి వారి సంతాన మైనందున ఈజాతియంతయు సంకరజాతిగా ప్రచారము చేసిరి. ఆవాదములనే వారి మానసపుత్రులైన హూణభాషా కోవిదులగు భారతీయ చరిత్రకారులు ప్రచారములోనికి దెచ్చుటకు వారి శక్తి కొలది ప్రయత్నించుచుండిరి. దీనికి కారణము పాశ్చాత్య భావదాస్యము తప్ప వేరుగాదు. పైవిచారణ వలన వీరి వాదమంతయు పేకముక్కలతో నిర్మింపబడిన సౌధమువలె కూలి నేలమట్టమైనది. ఇప్పటి కైనను వీరు కనులు తెరచి తమ వాఙ్మయమును చిత్తశుద్ధితో పరిశోధించుకొని చరిత్రలను వ్రాయుటకు ప్రయత్నించుట శ్రేయస్కరము.

మద్రాసులోని తెలుగుభాషాసమితి వారిచే ఆంధ్రప్రజల కష్టార్జిత ద్రవ్యము కొన్నిలక్షలు వెచ్చ పెట్టి వ్రాయించబడుచుండిన తెలుగువారి చరిత్రగ్రంధములలో 'ఆంధ్రులను' గురించి శ్రీ శిష్ట్లానరసింహశాస్త్రిగారి కుమారుడు శిష్ట్లా రామకృష్ణశాస్త్రి M.A. గారిచే వ్రాయించి చేర్పించ నుద్దేశించిన దీ బాహ్యజాతివారయిన అంధ్రలే ఆర్యాంధ్రులని చెప్పెడి అసత్యచరిత్ర కావచ్చు నని సందేహము కలుగుచున్నది. పాపము శమించుగాక!

ఈ ప్రాచ్యక దేశ భాగమునకు ఆంధ్రదేశమనుపేరిడిన బలి మహారాజుయొక్క ఆఱవ కుమారుడయిన 'ఆంధ్రరాజు' యయాతి చక్రవర్తి నాలుగవ కుమారుడగు 'అనువు' వంశములోని ఆఱవతరము వాడయిన 'జనమేజయుని' వంశములోనివాడు. చంద్రవంశమునకు చెందిన రాజు. ఈ రెండువాదములును పరిశోధింపదగినవే యని వ్యాసకర్త గారు చెప్పుట శుభావహము. కాని వారు చెప్పిన మొదటివాదము