పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                "గురు నుగ్రసేను యదు దద్భోజాంధకాధీశుని
                 ర్మలు బట్టెం గడు వాలి యేలె జలమారన్ శూరసేనంబులన్."
                                                                  (ఆం. భాగ. పూ. భా. 10-54.)

అని అంధకవంశమువారి చరిత్ర మనకు పురాణము లన్నిటియందును విశేషముగా గలదు. అంధకవంశము వారి కాలము ఈ 28 వ మహాయుగములోని ద్వాపరాంతము. (క్రీ. పూ. 3254)

ఇట్టి పవిత్ర క్షత్రియవంశ మగు 'అంధక వంశము' 'అంధ్రల నెడి' బాహ్యజాతి యని అసత్యప్రచారము చేయుచు పాశ్చాత్యులచే వ్రాయబడిన అనృతమును అవమానకరమునగు చరిత్రను సమర్థించుటలో గల ఆంతర్యమేమియో తెలియకున్నది. అసత్యములగు ఊహాగానముల చేయక శ్రద్ధాభక్తులతో పండితుల నాశ్రయించి పరంపరాగతమైన పురాణాది సంస్కృతవాఙ్మయమును చదివి సత్యమైన భారతదేశ చరిత్రను వ్రాయుట ప్రతిభారతీయునికిని ధర్మము అని తెలియవలెను.

అశ్మక, మూలకులు

"బౌద్ధవాఙ్మయము ననుసరించి మొదట గోదావరిలోయలోనికి వలసవచ్చి నివసించినవారు 'అశ్మకులు' (Asmakas) మూలకులు (Mulakas) అనెడి తెగలవారు. 'సుత్తనిపట్ట'యనెడి బౌద్ధగ్రంధ వ్యాఖ్యానములో అశ్మరుడు. మూలకుడు అనెడి ఇద్దరు ఆంధ్రరాజులు గలరని చెప్పబడినది. ఇందువలన అశ్మకులు, మూలకులు అనెడి రెండు ప్రత్యేకమైన తెగలు 'అంధక' ;ఏక 'అంధ్ర' అనెడి బాహ్యజాతిలో గలవని స్పష్టముగా ఋజువగుచున్నది. కాబట్టి 'అంధ్ర' లనెడి బాహ్యజాతి వారిలో అవాంతరశాఖ లనేకము లున్నట్లు, స్పష్టపడుచున్నది. ఆ తెగలలో పైన చెప్పబడిన అశ్మక మూలక అను తెగలుగాక శాతవాహనులుకూడ బాహ్యజాతివారే. కాబట్టి 'అంధ్ర'లనెడి (దారిదోపిడి దొంగలగు) బాహ్యజాతివారిచే నివసింపబడిన యీ గోదావరిలోయ