పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంధక వంశము

ద్వితీయ అంధకుడు

|

అభిజిత్తు

|

పునర్వసు

|

ఆహుకుడు

|

1. దేవసేనుడు, 2. ఉగ్రసేనుడు.

|
దేవంతుడు

పుత్రికలు ఏడ్వురు. వీరందరును వసుదేవునకు భార్యలైరి. అందు చివరి కూతురు దేవకీదేవి.


ఉగ్రసేనుడు

|

వీనికి తొమ్మండ్రు కుమారులు. వారిలో కంసు డగ్రజుడు. కుమార్తెలు ఐదుగురు.

ద్వితీయ భజమానుడు

|

విదూరథుడు

|

రాజాధి దేవుడు

|

వాత, నివాత, శోణిత, శ్వేతవాహన, శమి, గదవర్మ, నితాంత అనువార లెనమండుగురు. అందు శమికి ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి హృదికుడు వానికి ద్వాదశపుత్రులు కలిగిరి. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. దేవబాహు రెండవవాడు. అందు దేవబాహువునకు కంబళబహరిషుండు గలిగె. వానికి అసమౌజసుండు కలిగె. అతనికి