ఐతరేయ బ్రాహ్మణమున గలదు. ఈ వాక్యమును వారు సరిగా వ్యాఖ్యానించక విశ్వామిత్రుని శాపమువలన "అంధ్రాది" బాహ్యజాతులేర్పడినట్లెంచి, 'అంధ్ర' అనెడి విశ్వామిత్రుని జ్యేష్ఠ కుమారునివలన 'అంధ్ర' లనెడి జాతివా రేర్పడినట్టు వ్రాసియుండిరి. కాని అది యసత్యము. ఈ బాహ్యజాతివారలు ప్రత్యేకమగు వర్గములుగనై దేశముల నాక్రమించెరనియెంచుట పొరపాటు. వీరలు ఆర్యులగ్రామములకును, పట్టణములకును, సమీపమున పురబాహ్యప్రదేశములందు నివసించు చుండిరని మనుస్మృతి స్పష్టముచేసియున్నది. వీరిలో ఆర్యులయొద్ద కూలిచేసికొని జీవించెడివారు కొందరును, అందు అంధ్రాది శాఖలుకొన్ని అరణ్యముల యందు నివసించి దారిని నడచు పాంధులను హింసించి వారి ధనముల గొనుచు చౌర్య హింసాదులచే జీవించువారలు కొందఱును అయియుండిరి. కాని వీరికెప్పుడును స్వతంత్రములగు తెగలుగా నేర్పడి దేశములో ప్రయాణము చేయుచు భూముల నాక్రమించి ప్రత్యేకమైన రాజ్యములను స్థాపించుట కీ భారతవర్షములో ఎట్టి యవకాశమును లేదు. మనుస్మృతి చదివిన వారి కీవిషయము అవగాహన కాగలదు. విశ్వామిత్రుని కాలమున కతిపురాతనకాలమునాటికే భారతవర్షమంతయు రాజ్యములతోను రాజులతోను నిండియుండినది. ఆవిధముగా అనాగరికులగు మోటుజాతులు దేశముల నాక్రమించుట విస్తారముగా ఐరోపాఖండములో ఇటీవలికాలమున జరిగియున్నది.
భారతవర్షమున వైదికధర్మములను త్యజించిన క్షత్రియశాఖలవారి నిచ్చట కులబహిష్కార మొనర్చగా వారలు వైదికార్యులను భాధించుచుండిన కాలమున వారిని దేశమునుండి సింధునదికి పశ్చిమమునకు తరిమివేయగా వారలు - అనగా శక, యవన, పారద, పల్హవ, హూణ, రోమక, బర్బరు లాదిగాగల బహిష్కృతార్య క్షత్రియ జాతులు - భారతవర్షము పశ్చిమోత్తర భాగములందు నివసించి అచ్చటి నుండి క్రమక్రమముగా పశ్చిమ దేశములకు పోయి అచ్చటి భూముల నాక్రమించి రాజ్యస్థాపనములు చేసియుండిరి. కాని భారతదేశములో