పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసత్యములును, అప్రమాణములు నైన కల్పితవాక్యములతో పూరింపబడిన వై యున్నవి. అవియే మన చరిత్ర పరిశోధకుల పరిశోధనలకు మూలము లైనందున ప్రాచీన చరిత్రము విషయమున వారిచే వ్రాయబడిన ప్రతివాక్యమును అసత్యములతో గూడి దేశమునకును జాతికిని అప్రతిష్ఠాకరములుగను అవమానకరములుగను పరిణమించుచున్న వని చెప్పవలసి వచ్చినందులకు చింతిల్లు చుంటిమి

విశ్వామిత్రుని కుమారులలో జ్యేష్ఠునిపేరు "అంధ్రుడు" కాదు. అతనిపేరు 'అష్టకుడు' రెండవవాడు 'హారీతుడు' మూడవవాడు 'జయంతుడు' నాలుగవవాడు 'సుమదుడు'. అనువార లని శ్రీమద్భాగవత నవమష్కంధమున స్పష్టముగా చెప్పబడియున్నది. శ్రీ బమ్మెర పోతనామాత్యుడు దీనిని తెనిగించి తెలుగుజాతి కిచ్చియున్నాడు. తెలుగువారలయిన చరిత్రపరిశోధకులు శ్రీమదాంధ్ర మహాభాగవతము నైనను చదువక ఇట్లు అసత్యకల్పనలతో ఆంధ్రులచరిత్రను వ్రాసి ప్రకటించుట న్యాయముగా లేదు. వారికి ఆంధ్రులందరును తమ తీవ్రమగు అసమ్మతిని తెలియజేయుచున్నారు. ఇప్పటికైనను వారు అసత్యమార్గములను విడిచి సత్యమార్గము ననుసరించెదరు గాక!

'ఆంధ్రు' లనెడి భాహ్యజాతి విశ్వామిత్రుని సంతానము కాదు. ఆతని శాపమువలన ఏర్పడినది కాదు. విశ్వామిత్రుడు పుట్టుటకుముందు నుండియు లేక సృష్ట్యాదినుండియు చాతుర్వర్ణ్యములతో గల ఆర్య జాతియు, ఆ నాలుగు వర్ణముల యధార్మిక సంమిశ్రణమువలన కలిగిన అరువదినాలుగు 'అనులోమ, విలోమ' జాతులును గలవు. విశ్వామిత్రునిచే శపింపబడిన అతని జ్యేష్ఠకుమారు లైన అష్టక, హారీత, జయంత సుమదాదులు ఏబదిమందియు అదివఱకుండిన అంధ్రాదులైన బాహ్యజాతులలో చేరి దస్యులై దారిని పోవువారిని హింసించి వారి ధనములను దోచుకొనుచు చౌర్యహింసాదులే జీవికగా కలవారైపోయి రని"బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనాం భూయిష్టా:" విశ్వామిత్రుని సంతానము దస్యులలో హెచ్చుగా మిళితమై పోయిన దని