పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపము దాల్చిన చరిత్రలు ముందో నిర్ణయించుకొనుడు. మనస్సులో శబ్దరూపమున గల సంకల్పము కార్యరూపము దాల్చిన అది చరిత్ర యగును.

"వంశనామము లా వంశముయొక్క మూలపురుషునివలన ఏర్పడుట మనదేశములోని ఆచారము. అందువలన "అంధ్ర"లు అనెడి ఈశాఖకు విశ్వామిత్రునిచే శపింపబడిన ఆతని జ్యేష్ఠపుత్రులలో జ్యేష్ఠునిపేరు 'అంధ్ర'అని యైయుండవచ్చు"నని యీ వాదమును నమ్మినవారు సంశయించుచు చెప్పుచున్నారు. వారి యూహలు, కల్పనలు, సంశయములు కూడ ఈదేశమున సత్య చరిత్రలుగా చెల్లుబడి కాగల వను నమ్మకమే ఇట్టి వ్రాతలకు కారణము కావచ్చును. (ది 1-10-53 తేదిగల "హిందూ" పత్రికలోని ఆంధ్రులనుగురించిన వ్యాసమును చూడుడు.)

భారతవర్ష చరిత్ర వ్రాయుటకు భారతవర్షములో గల ప్రాచీన సంస్కృత వాఙ్మయము ముఖ్య ప్రమాణమని వీరికి తెలియని అంశము కాదు. ఇప్పు డాంధ్రదేశములోని "ఆంధ్రులు" సంకరజాతి యని చెప్పుటకు ప్రాచీన సంస్కృత వాఙ్మయమునే (ఐతరేయ బ్రాహ్మణమునే) వారు ఆధారపఱచుకొనిరి. అగుచో తమ వాదమును ధ్రువపఱచుకొనుటకు సందేహముతో గూడిన స్వీయకల్పన లేల చేయవలయునో తెలియకున్నది. భారతీయుల లేక అఖిల మానవజాతుల ప్రాచీన చరిత్రలన్నియు మన పురాణముల యందు చెప్పబడియున్నవి. అట్టివానిని చదువక వారు పరిశోధనలను నెపమున పాశ్చాత్యులచే వ్రాయబడిన అసత్యచరిత్రలను అనువదించి భారతదేశ చరిత్రను పూరించుచున్నారు.

సర్. విలియం జోన్సు (1774 A. D.) నుండి వి. ఎ. స్మిత్ (1915 A. D.) వఱకు - 18 శతాబ్దము చివర పాదమునుండి యిరువదవ శతాబ్ద ప్రథమపాదమువఱకు - వచ్చిన పాశ్చాత్య చరిత్రకారులచే (అం దే యొకరిద్దరో తప్ప) వ్రాయబడిన భారత దేశ చరిత్ర లన్నియు