పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఆర్యుడే' మూలపురుషుడు. కనుక 'ఆర్యులు' అతిపురాతన జాతివారై యున్నారు. మిగిలిన జాతులన్నియు వారికి పిమ్మటి వారినుండి యేర్పడిన వైయున్నవి. ప్రపంచమంతయును ఆర్యజాతితోడనే నిండియున్నది. మిగిలినవాటి నన్నిటిని ఆర్యులనుండి యేర్పడిన వివిధశాఖలుగా చెప్పవలయునే కాని అవియన్నియు ఆర్యులకంటె వేరైన ప్రత్యేక జాతులని చెప్పదగదు.

చాతుర్వర్ణ్యములతో గూడిన 'ఆర్యులు' అతిప్రాచీను లని తెలియవలెను. వారినుండి అనులోమ, విలోమ సాంకర్యమున అంధ్రాది బాహ్యజాతు లేర్పడినవి. ఇప్పు డాంధ్రదేశమున గల 'ఆంధ్రులు' చాతుర్వర్ణ్యములతో గూడి వేదోక్త ధర్మాచరణము కలిగి యుండినందున వీరు స్వచ్ఛమైన ఆర్యసంతతికి చెందినవా రైయున్నారు. వీరు అంధ్రాది బాహ్యజాతుల కంటె అతిప్రాచీనులు. వారి నుండియే మిగిలిన శాఖలన్నియు నేర్పడినవి. మంత్రములు బ్రాహ్మణములు అనుపేరున వేదములు బహిర్గత మగుచుండును. అభివృద్ద్జి ప్రారంబమందు శబ్దరూపమున ఆవిర్భవించిన వేదభాగములలో 'ఐతరేయ బ్రాహ్మణ' మొకటి యైయున్నది. అందు పూర్వసృష్టిలోని చరిత్రభాగములు తిరిగి వినబడుచుండును.

గతసృష్ట్యాదియందు వచ్చి యుండిన ఐతరేయ బ్రాహ్మణములందు వినబడిన విధమున ఆసృష్టిలో అనేకవిధము లగు చరిత్రలు జరిగి యున్నవి. అవియే యీసృష్టిలోని బ్రాహ్మణములందు వినబడుచున్నవి. అట్లు బ్రాహ్మణములలో వినబడిన చరిత్రలే ఈసృష్టియందు గతకాలమున జరిగియున్నవి. వర్తమాన కాలమున జరుగుచుండినవి. రాబోవు కాలమున జరుగగలవు. ఈ సృష్టి యంతయు లయించిన పిమ్మట ప్రళయకాలము దాని నియతిప్రకారము తీరినంతనే తిరిగి సృష్టి ప్రారంభమగుచుండిన కాలమున ప్రథమమున వేదము శబ్దరూపమున బహిర్గతము కాగలదు. ఈ విధముగా అనాదినుండియు అనంతకాలమువరకు వచ్చుచు పోవుచుండెడి ఈ సృష్టిలయములలో శబ్దము ముందో ఆశబ్దము కార్య