పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రమును చుట్టివచ్చిన తిరిగి మనము బయలుదేరిన సూక్ష్మబిందువు నొద్దకే వచ్చి చేరుదుము. చక్రమున కే బిందువు ప్రారంభమో అదియే అంత్యముగూడ నగును. ఆద్యంతములు రెండును చక్రములో ప్రతి సూక్ష్మబిందువునందును కల్గుచుండును. అనగా చక్రములో ఆద్యంతములు రెండు నేకస్థానమందుండుననుట.

అటులనే ప్రకృతి చక్రమందు సృష్టిలయములు ఒకేబిందువునందుండుచున్నవి. ఎచ్చట సృష్టి ప్రారంభమగునో అచ్చటనే లయము కూడ ప్రారంభమును పొందుచున్నది. పుట్టుట, పెరుగుట, లయించుట, తిరిగి పుట్టుట, లయించుచు పుట్టుచుండుట-ఇది ప్రాకృత లక్షణము. వెనుకటి సృష్టిలో జరిగిన విధముననే ఈసృష్టిలోకూడ కొంచె మించు మించుగ జరుగుచుండును. అందువలన వెనుకటి సృష్టిలో జరిగిన శునశ్శేఫుని చరిత్రము ఈ సృష్టిలోకూడ తిరిగి ప్రదర్శిత మగుచుండును. అన్ని సృష్టులకును, అన్ని లోకములకును, అన్ని కాలములకును వేద మొక్కటియే. గతసృష్టియందలి ఐతరేయ బ్రాహ్మణము చెప్పినటులనే ఈ సృష్టిలో కూడ చెప్పును.

ప్రతిసృష్టికిని ప్రారంభమున ప్రకృతినుండి 'శబ్దము' బహిర్గత మగును. ఆ శబ్దసమూహమే 'వేదము' లని చెప్పబడుచున్నది. అదియే ప్రకృతినుండి మొదట బహిర్గతమై సృష్టికి ప్రథమ పురుషుడైన ప్రజాపతికి వినబడినది. ఆతడు ప్రథముడైన ఆర్యుడని వేదమువలన వినబడుచున్నది.

'ఆర్యు'డనగా 'ఈశ్వరపుత్రు'డని వేదమాతయే నిర్దేశించుచున్నది. యాస్కాచార్యులును, సాయనాచార్యులును 'ఆర్యు'డన ఈశ్వర పుత్రుడని నిరుక్తమునందును వేద భాష్యమునందును వ్రాసియుండిరి. వాని నతడు స్మరించి తనకు పిమ్మట వచ్చిన 'దేవఋషు' లకును, వారు మానవులకును చెప్పుచుందురు. సృష్ట్యాదియందు ఆర్యుడే మొదటివాడుగా వచ్చినందున ఇప్పుడు ప్రపంచమున గల సమస్త జాతులకును