పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లని పిలువబడుటకు మే మంగీకరించితిమి. మేము నిన్ను మాకు జ్యేష్ఠుడవైన అన్నగా నెంచుకొంటిమి. నీ యాజ్ఞకు బద్ధులమై ని న్ననుసరించెదము. అని చెప్పెను. మధుచ్ఛందాదులైన కనిష్ఠు లేబదిమంది కుమారులును, తన యాజ్ఞను పరిపాలించినందులకు సంతోషించి విశ్వామిత్రు డా కుమారులను పశువులతోను, ధనముతోను, వీర్యవంతులైన పుత్రులతోను వృద్ధిపొందగలరని యనుగ్రహించెను. శపించబడిన జ్యేష్ఠపుత్రులు కౌశికగోత్రమునుండి తొలగిపోయి గోత్రశూన్యులై వేదధర్మావలంబులగు చాతుర్వర్ణ్యస్థులకు వెలియై వేదశాస్త్రాది విద్యలను మఱచిన వారై చౌర్యహింసాదులు వృత్తిగా గలిగి అట్టి జీవనము సాగించుచుండిన అంధ్రాదులైన అరువదినాలుగగు బాహ్యజాతివారిలో కలిసి మిళితమై వారితోడ సంబంధబాంధవ్యములు గలిగినవారై దస్యులైరి. వారు దస్యుజాతిలోనే పుత్రపౌత్రాభివృద్ధి గలవారై అనేకులుగా వృద్ధిపొంది యుండిరని "బహవో భవంతై విశ్వామిత్రా దస్యూనాం భూయిష్ఠా:" అని ఐతరేయ బ్రాహ్మణముననే వినబడుచున్నది. ఒకసారి వైదిక ధర్మమునుండి భ్రష్టుడైనవాడు తిరిగి వైదిక ధర్మమున కధికారి కానేరడు. వాడు భ్రష్టుడై ఇతరములైన మ్లేచ్ఛాది ధర్మముల నాశ్రయించవలసినదే కాని యెట్టి ప్రాయశ్చిత్తముచేతను వైదిక ధర్మమున చేర్చుకొనబడడు. ఈ యాచారము సృష్ట్యాదినుండి నేటివఱకు హిందువులలో పాటింప బడుచుండినది. నాలుగు వర్ణములలో నేవర్ణమువారును వైదికధర్మ భ్రష్టుడైన బ్రాహ్మణుడైనను చేర్చుకొన రను సంగతి మన కీనాటివఱకును నిత్యానుభవములో నున్న విషయమైయున్నది. ఇట్టి స్థితిలో కేవలము వర్ణాశ్రమధర్మములను కాపాడుకొనుటయే ముఖ్యధర్మముగా రాజులును, ప్రజలును పాటించుచుండిన అతిప్రాచీనకాలమున కులభ్రష్టులై బాహ్యజాతులుగా మారిపోయిన విశ్వామిత్రుని జ్యేష్ఠకుమారు లేబదిమందియు, వారి సంతానమును తిరిగి వైదికధర్మము నాశ్రయించి అగ్రవర్ణములో జేరి వేదశాస్త్రాధ్యయనాదు లొనరించి రనుట పొసగదు. వారలు దక్షిణముగా వచ్చి ఆంధ్రదేశము నాక్రమించి దానికి తమపే