పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కణ్వుడు ఆంధ్ర వ్యాకరణ పితామహు డగుటవలన ఆత డాంధ్రు డని స్పష్టము.

వేదవ్యాసుదు భారత యుద్ధకాలమునకు పూర్వమే గలడు. భారతయుద్ధకాలము క్రీస్తుపూర్వము 3188 సం. ఆనాటికి భీష్ముడు 236 సంవత్సరముల వయస్సుగలవాడు. భీష్ముడును వేదవ్యాసులును కొంచెము ఇంచుమించుగా సమవయస్కు లని చెప్పవచ్చును. కనుక వేదవ్యాసుని జననము క్రీ. పూ. 3138 + 236 = 3374 B.C. వేదవ్యాసుల శిష్యుడు వైశంపాయనుడు. ఆతని కాలము 3300 B.C. గా నిర్ణయించవచ్చును. వైశంపాయనునియొద్ద యాజ్ఞవల్క్యుడు కృష్ణ యజు ర్వేదమునభ్యసించెను. గురుశిష్యులమధ్య భేదాభిప్రాయము గలిగినందున యాజ్ఞవల్క్యుడు సూర్యు నారాధించి శుక్లయజు ర్వేదము నభ్యసించి లోకమున కనుగ్రహించెను. ఉపనిషత్తులలో మేటియగు "బృహదారణ్యకోపనిషత్తు" శుక్ల యజు ర్వేదము లోనిది. అది యాజ్ఞవల్క్యుని వలన భూలోకమునకు తేబడినది. కనుక యాజ్ఞవల్క్యుని కాలము కలిపూర్వము 198 లేక క్రీ. పూ. 3300 గా నిర్ణయించవచ్చును. యాజ్ఞవల్క్యుని శిష్యుడైన కణ్వుడు శుక్ల యజుస్సులో నొకశాఖను ప్రథమమున అభ్యసించినందున అది "ప్రథమశాఖ" యను పేరును పొందినది. దీనికే 'కాణ్వ శాఖ' యని పేరు. కనుక కణ్వుడు క్రీస్తుపూర్వము 3300 కాలపువాడని లెక్క తేలుచున్నది. క్రీస్తుపూర్వము 3300 + 1954 A.D. = 5254 సంవత్సరముల క్రిందట కణ్వుడు గలడని మనము నిర్ణయించుకొన వచ్చును. కాని భరతుడును వాని తల్లియగు శకుంతలయు తండ్రియగు దుష్యంతుడును తాతయగు కణ్వుడును ద్వాపరయుగము నాలుగవపాదములో - అనగా రెండున్నరలక్షల సంవత్సరముల క్రిందట-నున్నట్లు పురాణప్రసిద్ధి కలదుకదా! దీనిబట్టి వారు వేరు కావచ్చునని తోచుచున్నది.

ఇవి కాక ఆంధ్రులచరిత్రలో ఇప్పటికి దొరకిన శాసనముల ననుసరించి చతుర్వర్ణములకు చెందిన అనేకములగు ఆంధ్రరాజ కుటుంబములు వర్ణితములయి యున్నవి. సమగ్రమైన ఆంధ్రులచరిత్ర