పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       "ఆథర్వణాని కాణ్వాని బార్హస్పత్యాని సంవిదన్
        కౌముదీ మాంధ్రశబ్దానాం సూత్రాణి కరోమ్యహం."
                                                   (ఆంధ్ర కౌముదీ)

పై ప్రమాణమువలన కణ్వమహర్షి ఆంధ్ర వ్యాకరణమును రచించినట్లు స్పష్టముగా తెలియు చున్నది.

ఆంధ్రదేశమున కణ్వనది కలదని ప్రమాణము కలదు:

        "ఆంధ్ర భూమండలీ మధ్యం సంపుల్ల సరసీరుహం |
         గౌతమీ-సింధు-కౌంతేయ-కణ్వనద్యో జగన్ను తా:||"
                                                             (భీమేశ్వర పురాణము 25 పుట)

(ఈ కణ్వనది యేదియో గుర్తింపరాకున్నది.)

కణ్వ మహర్షి గోత్రకర్త. సూత్రకర్త యగు బోధాయనుడు కణ్వుని కుమారు డని తెలియుచున్నది.

         "బోధాయన పితృత్వాచ్చ ప్రశిష్యత్వా ద్దివస్పతే: |
          యాజ్ఞ వల్క్యస్యశి ష్యత్వాత్ కణ్వో భూన్మహతాం మహాన్||"
                  (ఆదిత్య పురాణము, ఉత్తర ఖండము, 2 వ అధ్యాయ. 33 శ్లో.)

తా|| బోధాయన మహర్షి యొక్క తండ్రి యగుటచేతను, సూర్యునికి ప్రశిష్యు డగుటచేతను, యాజ్ఞవల్క్య మహర్షి శిష్యు డగుట చేతను కణ్వమహాముని మహానుభావులైన మునులలో గొప్పవా డని తాత్పర్యము.

          "కాణ్వాయ బౌద్ధాయనాయ."
                                      (బోధాయన గృహ్యసూత్రము 3-13)

తా|| కణ్వుని పుత్రుడు బౌద్దాయను డని అర్థము.

శుక్ల యజుర్వేదమును సూర్యునియొద్ద ప్రథమమున అధ్యయనము చేసినది యాజ్ఞవల్క్యుడు. ఆయనవద్ద అధ్యయనము చేసిన శిష్యులలో