పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరు గౌడదేశములోని "గోళకి" మఠమునకు కూడ ఆధిపత్యమును వహించిరి. ఈయన 11 వ శతాబ్దివా డనుచున్నారు. ఇంకను పరిశోధించ తగియున్నది.

8. మల్లికార్జున పండితులు:- గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం నివాసి. తండ్రి భీమన పండితుడు. తల్లి గౌరాంబ. గౌతమస గోత్రము. శివతత్త్వ నాదము, లింగోద్భవ దేవ గద్య, అమరేశ్వరాష్టకము మొదలగు గ్రంథములను రచించెను. ఈతని చరిత్రము గల శిలాశాసనము గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని చందవోలుగ్రామమున గలదు. దాని నకలు ఆంధ్రసాహిత్య మండలివారు ప్రకటించిన "శివతత్త్వసార" మనెడి గ్రంథములో గలదు. వీరింటిపేరు తెలియదు. కాని వీరిప్రాముఖ్యము ననుసరించి వీరిపేరే వీరివంశీయులకు ఇంటిపేరైనది. అనగా "మల్లికార్జున పండితారాధ్యులవారు" అని ఏర్పడినది. వీరు ఆంధ్రులు. వీరందరు వైదికధర్మానుసారులై వర్ణాశ్రమ ధర్మాదుల ననుసరించుచు శైవమతవ్యాప్తి నొనర్చినవారు.

9. విశ్వేశ్వర శివ దేశికులు:- వీరు శైవమఠమును స్థాపించి పాలించియుండిరి. కాకతీయ గణపతిదేవుని ప్రాపున శైవమత వ్యాప్తి నొనరించిరి. వీరు శివతత్త్వ రసాయనము, పురుషార్థ సారము మొదలగు గ్రంథములను రచించిరి. శ్రీ గణపతి దేవ చక్రవర్తికి వీరు గురువర్యు లైయుండిరి. ఈయనగారి వంశీయులు "శివ దేవునివారు" అనెడి ఇంటి పేరున ఇప్పుడు వ్యవహరింపబడుచున్నారు. వీరిది శ్రీవత్సవ గోత్రము, ఆపస్తంభ సూత్రము, యజుశ్శాఖ. వీరు ఆంధ్రులు. 14 వ శతాబ్దికి చెందినవారు.

10. ముదిగొండ వీరభద్రారాధ్యులు:- వీరు భాతద్వాజస గోత్రజులు. వినుకొండ తాలూకాలోని 'తెల్లపాడు అగ్రహారము' వీరి కాపురము. వీరిచే "సిద్ధాంతోత్తర కౌముదీ" "చిన్మయ దీక్ష" అను గ్రంథములు రచింపబడినవి.