పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగర రాజులు ఆదివరాహ చిహ్నము గలవారు. శాతవాహనులు, ఆంధ్రచక్రవర్తులు 'సింహ' చిహ్నము గలవారు. కళింగులకు ఏనుగు. ఈ మొదలగు చిహ్నము లందరికిని గలవు. ఆంధ్రులు సింహము మీద కూర్చుండిన యోధుని చిహ్నము గల జండా కలిగి యుండెడివారు. అందువలన మగధలోని ఆంధ్రచక్రవర్తులకు "శాతవాహనులు" అను బిరుదు కలిగినది."

ఆంధ్ర చక్రవర్తులు

వ. నెం. చక్రవర్తుల పేర్లు రాజ్యకాలము కలి సం.లు నుండి - వఱకు క్రీ. పూ. నుండి - వఱకు
1 శ్రీముఖశాతవాహన చక్రవర్తి 23 2269-2292 833-810
2 శ్రీకృష్ణశాతకర్ణి 18 2292-2310 810-792
3 శ్రీమల్ల శాతకర్ణి 10 2310-2320 792-782
4 పూర్ణోత్సంగశాతకర్ణి 18 2320-2338 782-764
5 శ్రీశాతకర్ణి 56 2338-2394 764-708
6 స్కంధస్తంభిన్ 18 2394-2412 708-690
7 లంబోదర శాతవాహన 18 2412-2430 690-672
8 ఆపీతక శాతవాహన 12 2430-2442 672-660
9 మేఘస్వాతి శాతవాహన 18 2442-2460 660-642
10 శాతస్వాతి శాతవాహన 18 2460-2478 642-624
11 స్కందశాతకర్ణి 7 2478-2485 624-617
12 మృగేంద్రశాతకర్ణి 3 2485-2488 617-614
13 కుంతలశాతకర్ణి 8 2488-2496 614-606
14 సౌమ్యశాతకర్ణి 12 2496-2508 606-594