Jump to content

పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వరుస నెంబరు రాజుపేరు రాజ్యమునకు పెట్టినపేరు ప్రజలకుకలిగిన నామము
27 హరి హరివర్షము హరివర్షీయులు
28 ఇలావృతుడు ఇలావృతవర్షము ఇలావృతులు
29 కేతుమాలుడు కేతుమాలవర్షము కేతుమాలులు
30 భద్రాశ్వుడు భద్రాశ్వవర్షము భద్రాశ్వులు
31 రమ్యకుడు రమ్యకవర్షము రమ్యకులు
32 హిరణ్యక హిరణ్యకవర్షము హైరణ్యకులు
33 కురు కురువర్షము కురువర్షీయులు
34 స్వాయంభువునకు భరతుడను నామముకలిగినందున ప్రథమమున మనభూభాగమునకు భారతవర్షమని పేరు కల్గినది. అతనికిపిమ్మట అతని కుమారుడగు నాభియనువాడు రాజై యీభారతవర్షమునకు అజనాభమని పేరు మార్చియుండెను. అజనాభము అజనాభులు
నాభికి పిమ్మట అతని (కుమారుడగు ఋషభునితనయుడు) మనుమడగు భరతునివలన ఈ అజనాభము తిరిగి భారతవర్షమని పిలువబడినది. (ఈతడే జడభరతు డని పేరొందిన వాడు) భారతవర్షము భారతులు

ఇట్లు రాజనామములచే దేశములు పిలువబడినందున ఆయాదేశవాసు లాయా దేశనామములచే పిలువబడిరి. అదేప్రకారము ఆంధ్రరాజువలన పరిపాలింపబడి అతనిపేరున "ఆంధ్రదేశ"మని పిలువబడిన -