పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్యుల భరతఖండ వ్యాప్తి

బ్రహ్మావర్తమునుండి మధ్యదేశమువఱకు నివసించిన ఆర్యులు క్రమక్రమముగ వృద్ధినొంది సరస్వతీనదీ ప్రాంతములనుండి తూర్పుగను, పశ్చిమముగను, దక్షిణముగను పోయి భారతవర్ష మంతటను నిండిరి. ఆర్యజాతీయులతోబాటు బాహ్యజాతివారలుకూడ నున్నందున వారికి చాతుర్వర్ణ్యస్థులగు ఆర్యులు నివసించెడి గ్రామబహి:ప్రదేశములందు స్థిరనివాసములు కల్పింపబడినవి. చాతుర్వర్ణ్యస్థులు, బాహ్యులు అనబడెడి ఆర్యశాఖలవారందరు ఎవరిహద్దులలో వారుండి వారివారి కేర్పడిన నియత కార్యముల నొనర్చుకొనుచు ఐకమత్యముగలవారై వృద్ధిపొందిరి. అందులకు విరుద్ధముగ నడచుచు ప్రజాపీడాకారులైనవారు దేశమునుండి వెడలగొట్టబడిరి. ఆసేతుహిమాచలముగాగల భారతవర్ష మంతటను ఈచాతుర్వర్ణ్యములతో పాటు బాహ్యజాతివారలు కూడ పోయి వారిప్రక్కనే నివసించుచుండిర నెడి సంగతిని మనము మరువరాదు. వీ రేదేశమునచేరిన ఆ దేశనామముచే పిలువబడుదురని మనువు 10-21-22-23 లో చెప్పియున్నాడు. ఈబాహ్యజాతివారందరు ఆర్యసంఘములో చేరినవారే కాని బయటివారు కారు.

ఆంధ్రదేశము

ఇట్లు కాలము గడచుచురాగా చంద్రవంశక్షత్రియుడగు యయాతిచక్రవర్తి నాలుగవ కుమారుడగు 'అసువు' వంశములో 'అసువు' నుండి లెక్కింపగా పదమూడవ ప్రముఖవంశమువాడగు 'బలి' అనురాజు బంగాళదేశము లగాయతు దక్షిణముగా మద్రాసుకు దిగువ భాగమునగల ప్రదేశమువఱకు పరిపాలించుచుండెను. ఆతని పితృపితామహులు కూడ దీనిని పాలించియుండిరి. ఈ రాజ్యమునకు 'ప్రాచ్యక' రాజ్యమని పేరు. ఈ ప్రాచ్యక రాజ్య మంతటను చాతుర్వర్ణ్యస్థులైన ఆర్యులును వారియందంతర్భూతమై యుండిన బాహ్యకులములవారును ఇంకను గల అనులోమ, విలోమ శాఖలకు చెందిన