పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించకుండునట్లును, గుంపులుగా గూడి దేశములో సంచారము చేయకుండునట్లును రాజకీయ శాసనము లుండెడివి. వారలు తమ కేర్పరుపబడిన స్వతంత్రవృత్తులు చేసికొనుచు కొన్ని నియమములకులోనై స్వేచ్ఛగా జీవించునట్లు ఏర్పరుపబడినది. మనుధర్మశాస్త్రమును చదివినవారల కీవిషయము లన్నియు వివరముగా తెలియగలవు.

శక, యవనాది బహిష్కార శాఖలు

ప్రాచీనభారతవర్షములో క్షత్రియశాఖ లనేకముగా వృద్ధినొందినవి. అందు కొన్ని శాఖలవారు వేదోక్త ధర్మములగు ఉపనయనాది సంస్కారముల వదలి యుండుటవలన వారిని ఆర్యులు సంఘమునుండి బహిష్కరించిరి. శక, యవన, బర్బర, పౌండ్రక, ఓడ్ర, ద్రవిడ, కాంభోజ, పరద, వప్లప, చీన, కిరాత, దరద, ఖశ, హార, హూణ, రూమక మొదలుగాగల క్షత్రియశాఖలవా రందరీ విధముగా బహిష్కరింపబడిరి. వారు చౌర్యహింసాదులను వృత్తిగాగొని ఆర్యులను బాధించుచుండిరి. వీరందరు దస్యులుగా పరిగణింపబడిరని మనువు చెప్పుచున్నాడు. (మనుస్మృతి 10-43-45). ఋగ్వేదాదులలో వినబడుచుండిన దస్యులనగా ఈపైనచెప్పబడిన బహిష్కరింపబడిన ఆర్యజాతివారలే యని గ్రహించవలెను.

ఆర్యులను హింసించు "దస్యు"లనబడిన వారలు ఆర్యులకు జ్ఞాతులనియు, వారుకూడ ఆర్యజాతికి చెందినవారలే యనియు ఋగ్వేదముననే వినబడుచున్నది.

శ్రుతి: "యఋక్షా దంహసో ముచ ద్యోవార్యా త్సప్తసింధుషు." (ఋగ్వే 4-24-28).

తా|| పరిపరివిధముల మమ్ము హింసచేయు, సప్తసింధుదేశమున గల ఈ యార్యజాతినుండి యేఇంద్రుడు మమ్ము కాపాడగలడో అట్టి ఇంద్రుని ప్రార్థించుచుంటిమి.

ఆర్యులను హింసించుచుండిన వారుకూడ "ఆర్యులే" యనియు