పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రులు

సృష్ట్యాదియందు "ఆర్యజాతి" తప్ప వేరుజాతి లేదు. ఆర్యులు భారతవర్ష మంతటను వ్యాపించి నివసించియుండిన కాలములో నాయా దేశభాగములను పరిపాలించిన రాజులపేరున ఆయా దేశములు పిలువబడినవి. అట్టి దేశములలో నివసించిన ప్రజ లాయా దేశనామములచే పిలువబడ జొచ్చిరి. అట్లు పిలువబడిన పేర్లతో వారే వేరువేరు జాతులుగా గుర్తింపబడి యుండిరి.

ఆర్యులు దేశవ్యాప్తము నొంది నివసించియుండిన పిమ్మట ఒకానొకకాలమున తూర్పుభారతవర్షము "ప్రాచ్యకదేశ"మని, పేరు గలిగి "బలి" యనెడి రాజుచే పరిపాలింపబడుచుండినది. ఆతని కుమారులా దేశమును విభాగించుకొని తమపేర్లతో నాదేశభాగములకు పేరులుపెట్టి యేలిరి. వారిలో "ఆంధ్రరాజు" పరిపాలించిన భాగమునకు "ఆంధ్రదేశ" మని పేరు పెట్టబడినది. ఆదేశమున నివసించుచుండిన చాతుర్వర్ణ్య ఆర్య ప్రజలు నాదేశముపేరున "ఆంధ్రులు" అని పిలువబడిరి. ఆర్యజాతియే ఆంధ్రజాతి యని పిలువబడినది. అది వేరుజాతి కాదు. ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములలో సృష్ట్యాదినుండి "ఆంధ్రు"లను పేరు వచ్చువఱకు ఆంధ్రుల చరిత్ర ఆర్యుల చరిత్రయే గాని వేఱు కాదు. అందువలన సృష్ట్యాది లగాయతు గల ఆంధ్రులచరిత్ర ఆర్యుల పేరుమీదనే చెప్పబడును. దానిని ఆంధ్రులచరిత్రగానే తీసికొనవలయునుగాని అది ఆంధ్రులకంటె వేఱుగాగల ఆర్యులచరిత్ర యని భ్రమించకూడదు. 'ఆంధ్రులు' ఆర్యులేగాని యితరులు కారు. ఒకేజాతివారు ప్రారంభములో "ఆర్యు" లనియు, కొంతకాలమునకు వారే దేశనామముచే "ఆంధ్రు" లనియు పిలువబడిరి. వారు రెండుజాతులవారు కారు. ఏకజాతీయు లైయున్నారు. ఇదేప్రకారము భారతవర్షములోని వివిధ రాష్ట్రములందు నివసించెడి ఆర్యులును ఆయా దేశనామములచే వివిధ శాఖలుగానై వివిధ జాతులుగా పరిగణింపబడుచుండిరి. కాని ఆసేతుహిమాచలముగా గల ఆర్యులందరు ఏకజాతీయులైన ఆర్యులే యైయున్నారు. ఈవిషయము మనసునందుంచు