పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

7

" సంస్కృతియనగా నాగరికత, లలితకళలు, సారస్వతము, సభ్యత, దైనందినాభివృద్ధి మున్నగు నుత్తమ గుణములన్నియు కలసిన విశిష్ట గుణము" అని కీ.శే. సురవరము ప్రతాపరెడ్డిగారు తమ "ఆంధ్రుల సాంఘిక చరిత్ర"లో సంస్కృతిని నిర్వచించారు. కాని, కొందరు విమర్శకులు నాగరికత, సంస్కృతి ఒకటి కావనీ, నాగరికత సంస్కృతిలో చేరదనీ అభిప్రాయపడినట్లు కనబడుతుంది. నాగరికతలేని సంస్కృతి ఉండదు; ఉండలేదు. కాని సంస్కృతి లేకుండా నాగరికత ఉండవచ్చును. - ఇది వారి వాదసారాంశం.


"If we attempt to differentiate between culture and civilisation, we might say that civilisation is the organisation of life which makes a civil society possible. Such a civil society is the condition for corporate life in which individuals can pursue fruitful and creative activity. Culture, on the otherhand, is the resultant of such organisation and expresses itself through language and art, through philosophy and religion, through social habits and customs, and through political institutions and economic organisations. Not one of them is separately culture, but collectively they constitute the expression of life which we describe as culture. Civilisation is the organisation of society which creates the conditions of culture. There can, therefore, be no culture without civilisation, but there may be civilisations which have not yet developed their culture...culture is the efflorescence of civilisation... culture was, therefore, the result of liberation from the urgency of the problem of existence while civilisation was the form of machinery evolved for the achievement of such liberty."*

ప్రప్రథమంగా మానవుడు పరిష్కరించుకోవలసినది అస్తిత్వ సమస్య(problems of existence). ఆ సమస్యా పరిష్కారానికి మానవుడు కొంత సాధనసామగ్రిని పెంపొందించుకుంటాడు. ఆ సాధన సామాగ్రి అంతా నాగరికతా చిహ్నంగా పరిగణింపబడుతుంది. ఆ సమస్యాపరిష్కారానంతరం సంస్కృతి జనిస్తుంది. ఆ స్తిత్వ సమస్యాపరిష్కారఫలమే సంస్కృతి. మానవుడు మొదట తన ఉనికిని సుస్థిరం చేసుకున్న తరువాత,భౌతికంగా తనకు కావలసిన సాధన సామాగ్రిని సమకూర్చుకున్న తరువాత, మానసికంగా తనకు ఉల్లాసాన్ని ఇచ్చే కళలు, వినోదాలు మొదలైనవాటిని గురించి, తన మేధకు తృప్తినిచ్చే ఆధ్యాత్మిక విషయాలగురించి కృషిచేయడానికి ఆరంభిస్తాడనీ, తత్కృషిఫలితాలే మానవ సంస్కృతి చిహ్నాలుగా పరిగణింపబడుతున్నాయనీ మీది వివరణ సారాంశం.


  • Indian Heritage, Humayun Kabir, p. 37.