పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

4. 'ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర' (1957)

రచయిత : డా. యస్వీ. జోగారావుగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి. జె. సోమయాజులుగారు

ఇందులో యక్షగానముయొక్క పుట్టుపూర్వోత్తరాలు - దాని అభివృద్ధి వివరింపబడ్డాయి. ఇంచుమించుగా 500 యక్షగానాలు పరిశోధింపబడ్డవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రచురణ.


5. 'పోతన - అతని గ్రంథములు' (1961)

రచయిత్రి : డా. వి. రాజేశ్వరిగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

పోతన గ్రంథములను గురించి సమగ్రమైన పరిశీలన ఇందులో జరిగింది.


6. 'తెలుగులో స్థలపురాణములు' (1962)

రచయిత : డా.వి.జి. కృష్ణామాచార్యులుగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు

రెండు భాగములలో తెలుగులో ఉన్న స్థల పురాణముల గురించి చర్చింపబడినది.


7. 'ఆంధ్ర సాహిత్యములోని సామెతలు, నుడికారములు - సేకరణ - వివరణ' (1963)

రచయిత : డా.సి. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఆంధ్ర సారస్వత ప్రారంభంనుండి 18వ శతాబ్ది అంతమువరకు ఆంధ్ర వాఙ్మయంలో ఉన్నటువంటి సామెతలు, నుడికారములు సేకరించి ఈ రచయిత వివరించి యున్నారు.


8. 'తెలుగు క్రియారూప నిర్మాణము - తులనాత్మక పరిశీలనము' (1964)

రచయిత : డా.పి.యస్. సుబ్రహ్మణ్యంగారు

పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు

తెలుగునందలి క్రియాపదముల రూపనిర్మాణమును తక్కిన ద్రావిడభాషలసామగ్రితో తులనాత్మకముగ సమీస్ఖించిన సిద్ధాంత వ్యాసము.


9. 'ఛంసశ్శాస్త్రము - అవతరణ వికాసములు' (1965)

రచయిత : డా.ఎం.వి. సత్యనారాయణగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు