పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

13

ద్వితీయ ప్రతాపరుద్రుడి కాలంలో వీరు కోశాధ్యక్షులు. వీరు సంగమ వంశీయులు. తరువాత సాళువ, తుళువ, ఆర్వేటి వంశాలవారు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇంచుమించు రెండువందల యేభై యేళ్లు, విజయనగర సామ్రాజ్యం అప్రతిమాన వైభవంతో వర్ధిల్లింది. తుళువ వంశీయుల కాలం ఆంధ్ర వాఙ్మయానికి స్వర్ణయుగం. విజయనగర రాజులందరూ కళాపోషకులు. వేదభాష్యాలు వెలసిన కాలమిది. సంగమ వంశీయుడైన ప్రాడదేవరాయలే శ్రీనాధ కవిసార్వభౌముడికి కనకాభిషేకం చేసిన రసిక చక్రవర్తి. క్రీ.శ. 1565లో జరిగిన కాళికోట యుద్ధంలో విజయనగరం వారు పరాజితులయేరు. ఆ తరువాత కొంతకాలం ఈ సామ్రాజ్యం ఉన్నా, దాని పూర్వ వైభవం మరి రాలేదు. ఆంధ్ర కర్ణాత సంస్కృతులకు కూడలిగా ఉండి, సకల కళానిలయమైన విజయనగర పట్టణమే నశించింది.

తంజావూరు, మధుర, పుదుక్కోటలలో, నాయకరాజులు, ఆంధ్ర సారస్వతాన్ని ఆదుకున్నారు. ఆంధ్ర సంస్కృతిని దక్షిణదేశంలో వ్యాప్తిలోకి తెచ్చారు.

సంస్థానములు:

మొదట ఆంధ్రప్రదేశంలో సంస్థానాలను ఏర్పరచినవారు గోల్కొండ నబాబులు. 1802 లో ఆంగ్ల ప్రభుత్వం ఆయా సంస్థానాధిపతులకి, వారివారి అధికారాలను దఖలు పరచి, పేష్కను నిర్ణయించిణ్ంది. ఈ సంస్థానాధీశ్వరులు వెలమ, కమ్మ, క్షత్రియ, రెడ్డి కులానికి చెంది ఉన్నారు. చిన్నచిన్న బ్రాహ్మణ సంస్థానాలు ఉన్నవి. నూజువీడు, బొబ్బిలి, వేంకటగిరి, పిఠాపురం మొదలయినవి వెలమ సంస్థానాలు. వీరు పద్మనాయక వెలమలు. విజయనగరం, పెద్దాపురం మొదలైనవి క్షత్రియ సంస్థానాలు. అమరావతి, కపిలేశ్వరపురం మొదలయినవి కమ్మవారి ఆధీనంలో ఉన్న సంస్థానాలు. గద్వాల మొదలయినవి రెడ్ల సంస్థానాలు. ఈ సంస్థానాధిపతులందరూ, లలితకళాభిజ్ఙులు. కవి పండిత పోషకులు. కాకలు తీరిన మహా పండితులనేకులు వీరి ఆస్థానాల్లో ఉండేవారు.

ఆధునికయుగం - ఆంధ్ర సంస్కృతి (క్రీ.శ.1800 నుండి):

ఆధునికయుగంలో ఆంధ్ర సంస్కృతి బహుముఖాల అభివృద్ధి చెందింది. క్రీ.శ. 1953లో ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటి అఖిలభారత ప్రధానామాత్యులయిన పండిత జవాహర్లాల్ నెహ్రూగారు 1953 ఆగస్టు 1వ తేదీని కర్నూలుకు వచ్చి నూతన ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవాన్ని జరిపించారు. ఆంధ్రరాష్టావతరణకు పూర్వమే మనదేశములో వివిధ రంగాలలో కృషి సమగ్రంగా జరుగుతూనేవుంది. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ ఆర్. వెంకటరత్నంనాయుడు గారు మొదలయినవారు సంఘ సంస్కారానికి బహు విధాల ప్రయత్నాలు చేశారు. మహాత్మాగాంధీగారు ప్రారంభించిన హరిజనోద్దరణ ఉద్యమాన్ని కూడా శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రిగారు, దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, డాక్టర్