పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రవిజ్ఞానము

అంకల్గి - పీఠము - ఇది లింగాయతుల యాచార్య చీకము, అంకల్గి గ్రామము మార్కండేయ పర్వత పరిసరముల నున్నది. గోకాక్ జలపాతమునకు నైఋతి దిశగా A బెలగాం మండలము, బోంబై రాజధాని, లోనిది. అంకుడు చెట్టు – (వనౌ "వధి) దీనికి చిట్టి యంకుడు, కొండచెముడు అనియు ననుట కలదు. దీనిపాలు. వెగటుగ, కారముగ నుండి వేడిచేయును. ఆకులు ర తామర, మొలగజ్జి 'మొదలగు చర్మరోగము లను నివారించును. కుష్టురోగముపై గూడ బని చేయునని కొందరందురు. వాతమును, శ్వాసకాసలను తగ్గించును. దీనికి Nerium Antidysentericum అని పాశ్చాత్య నామమును, అంకోలమని సంస్కృత నామ మును గలవు. దీని విత్తనములు ఈ చెట్టున కంటుకొనిపోవునని చెప్పబడినది. అంకురార్పణము — నవధాన్యములు నీటం దడిపి పాలిక (కుండమూకుడు) లందుంచిన -నవి యంకురించును (అనగా మొలకలు లేచును). వానిని సమర్పించుటయని యర్ధము. ఇది వివాహములోని యొక కార్యము, మరియు ఉపనయన కార్యమున గూడ నిది చరించుం గలదు. అంకుశరేఖ- పురుష సాముద్రికము చూడుడు. స్త్రీ సాముద్రికము చూడుడు. అంకెలు ఆంధ్రమున అంకెలు భాషాక్షర సంప్రదాయమునకు లోబడి రూపముల నంది

నట్లు కలపబడుచున్నవి. ఇంక నీదేశమున బ్రచారమునంది వాడుకలోనున్న ఆంగ్లభాష యందలి యు తెలుగూర్చి విచారింతముగాక! అవి 'రోమన్ ఫిగర్సు' అనియు, 'ఇంగ్లీషు ఫిగర్స' అనియు ద్వివిధములుగ నున్నవి. రోమన్ న్యూమరికల్ అంకెలు, తరుచుగ గడియారములందు గంటలందెల్సు తావులను, అధ్యాయములు దెల్పు తావుల నరుదుగ వాడుచుందురు. కాని సర్వసాధారణముగ వాడబడుటలేదు. (అవి I, II, III, IV, V మొదలగునవి. రోమను న్యూమరికలు చూడుడు). ఇక మిగిలిన ఇంగ్లీషు ఫిగర్సు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 అనంబడునవి. వీధికి 'అరబిక్ఫిగర్సు' అనియుం చేరుకలదు. ఆరబ్బుజాతివారు మూరు లనిపించుకొనుచు స్పానియాదేశాధికారులై యుందుతరి వారి నుండి గ్రహింపఁబడినవని వాడుక కలదు. ఇంక నీయింగ్లీషు ఫిగర్సుం గూర్చి యాంగ్ల పండితుల యభిప్రాయములు ద్వివిధములుగ నున్నవి. కొందరు ఆ యం ఎన్ని సంఖ్య లందెల్సునో అన్ని గీతలు అందుండునటుల కల్పింపబడినవనియును, మరికొంద రాయం ఎన్ని సంఖ్యలం దెల్పునో అన్ని మూల (Angles) లందుండునటుల గల్పింపఁబడిన వనియును అభి ప్రాయకుడుచున్నారు.. కాని వారి యూహల కాధారములు లేవు. వారే ఇంకను నవి ఇంచుక మార్పులకు లోనై యుండుననియు, ఆంగ్ల భాషాక్షర స్తోంద్ర దాః యముమేర కొక వైపునకు వంచి వ్రాయణుడు చున్నవనియు నభి ప్రాయబడి యున్నారు. '