పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్వభృ

202

అశ్వమే

యడవిగుఱ్ఱములు కలవందురు గాని, నిజము

పరిశీలించిన నవి యడవియందే పుట్టి గిట్టుటగాక, సామాన్యపు దేశీయములగు గుఱ్ఱములక భేదమేమియుఁ గనబడదు. పూర్వ మైరోపా దేశములందు, జనులు గుఱ్ఱపుమాంసమును దినెడి వారట. అయినను దానిని స్వారిచేయుట కుప యోగింపకపోలేదు. ఆదినుండియు నరబ్బీ దేశ స్థులు, గుఱ్ఱముల వర్తకము చేయువారు. ఐరోపా దేశములందు వ్యవసాయపు జంతువులుగు వాడు చుందుకు. ఇంగ్లాండు దేశమున పైరుజాతి గుఱ్ఱము ప్రపంచమునందలి గుఱ్ఱము జాతులలో బెద్దది యందురు. దీనియెత్తు పదునేడు మూరలట. బరువు రెండువేల పౌనులట. షెట్ల్యాండు పోనీలును, బర్మాదేశపు పెగూలును పరుగెత్తు నొందినవి.

అశ్వభృత్యన్యాయము — గుఱ్ఱమెవరిది యన వీఁ డెవ్వరిభృత్యుడోవారిదనెనట. వీఁడెవ్వరి భృత్యుఁడన గుఱ్ఱముకలవారి భృత్యుఁడనైనట. ఇట్టి పెడసరపుమాటలు చెప్పెననుట కీన్యాయము వాడుచుందురు.

అశ్వమేధజుఁడు భారతమున (ఆది పర్వము) శతానీకున కశ్వమేధజుఁ డుద్భవించె భాగవతమున (నవమస్కంధము) శతానీకునకు సహస్రానీకుఁడు నాతని కశ్వమేధ జుఁడు పుట్టెనని కలదు. మత్స్యపురాణమున శతానీకునకు అధిసీమకృష్ణుఁడు పుట్టెననికలదు. హరివంశమున శతానీకునకు (చంద్రాపీడునకు) సత్యకర్ణుఁడుపుట్టి హస్తిపురినేలెననికలదు. మరియు సత్యకర్ణునకు శ్వేతకర్ణుఁడుపుట్టి విరక్తుఁడై రాజ్య మును విడిచిపోవఁగా నాతని భార్య గర్భవతి యైనను, భర్తతో వనమున కేగి, పర్వతపు లోయలో శిశువునుగని యచటనే విడిచిపోయె ననియు, ఆశిశువు రాలనడుమ దొరలుచుండఁ

గౌశిక గోత్రజులగు బ్రాహ్మణు లాశిశువునుఁ

బెనిచిప్రక్కలు పుండ్లుపడి నల్లని మచ్చలుగా మారుటచే నాతనికి ‘అజపార్శ్వుఁడు' అనుపేరు నిడిరనియు, నాతఁడు రాజ్యము జేసెననియుఁ గలదు.భాగవతమున సహస్రానీకునకునశ్వ మేధజుఁడు,వానికి ఆసీమకృష్ణుఁడు, వానికి నిచక్నుడుపుట్టెననియు, వాఁడు గంగలో హస్తిపురి కొట్టు కొనిపోవుటచే కౌశాంబిఁ జేరెననియుఁ గలదు. మత్స్యపురాణ విష్ణుపురాణాదు లించుమించుగ నీరీతినె చెప్పుచున్నవి. పిమ్మట హస్తిపురి కురు రాజ్యమున కెపుడును రాజధాని కాలేదు. పాండవవంశజులలో ఉదయనుఁ డు అనుమహా రాజు (కైస్తవశకమునకుఁ బూర్వమేడవ శతాబ్దమున) ప్రసిద్ధినొందియున్నాఁడు. ఆతని రాజధాని కౌశాంబి. ఆతని చరితము కథాసరి త్సాగరమున విస్తారము వర్ణింపఁబడియున్నది. భాస, సుబంధు కవులాతని చరితమును నాటక ముగాను, గద్యకావ్యముగాను గ్రంథముల జేసిరి కాళిదాసాది కవులును ఉదయనునిఁ బ్రశంసించిరి. ఉదయున, శతానీకులకునడుమనుండిన వారనామతరువులగు రాజులై యున్నారు.

అశ్వమేధయాగము అశ్వమును ప్రథాన యాగపశుపుగ గల యాగము.ఇది భూపతులు చక్ర వర్తులు ఆచరింపఁదగినక్రతువు.. పుణ్యస్థలములయందీ యాగ మంటపమునునిర్మించి యాగ మొనర్తురు. కాశీ మొదలగు స్థలములందివి యాచరింపఁదగినవి. కాశీయందలి దశాశ్వమేధ ఘట్ట మిటులనే పేరందినది.క్రతువొనర్చుటకు, బూర్వము చైత్ర శుద్ధపౌర్ణమియందు సాంగ్రహణి, ఇష్టినీ, అమావాస్య.యందు సంజ్ఞాని, ఇష్టినీ, వైశాఖ శుద్ధ పౌర్ణమియందు ప్రాజాపత్య పశ్వాలంభమును, నెరపవలెనని చెప్పఁబడినది. అశ్వమేధమునకు శ్యామ