పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మౌలికసదుపాయాల కల్పన, ఐటి ఇన్వెస్టిమెంట్ రీజియన్ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఐటి టవర్లు, ఐటి పార్కులు, ఐటి లేఅవుట్లు మొదలైనవి నెలకొల్పడం అటువంటి చర్యల్లో భాగం. వ్యాపారాన్ని నెలకొల్పటానికి అవసరమైన కాలవ్యవధిని తగ్గించడం కోసం సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థ నెలకొల్పబడుతుంది. నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా ఈ-బిజ్ ద్వారా వ్యాపార నిర్వహణ వ్యయం తగ్గించబడుతుంది. పారిశ్రామికరంగం తాలుకు భాగస్వామ్యంతో మానవవనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం మీద, ఇన్నోవేషన్ మీద, స్టార్ట్ అప్‌ల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టబడుతుంది. ప్రస్తుతమున్న 'సమాచార సమాజాన్ని' 'విజ్ఞానసమాజం'గా మార్చడమే ఈ చర్యలన్నిటి తాలూకు అంతిమ ధ్యేయం. ఈ సందర్భంగా మన పూర్వ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి మాటలను గుర్తు చేస్తున్నాను.' మన ప్రగతి కోసం సామాజిక పరివర్తన, సుస్థిర అభివృద్ధి అత్యావశ్యకం. ఇవి రెండూ నిర్దిష్ట కాలపరిమితిలో సాధ్యం కావాలంటే విజ్ఞానసమాజాన్ని నిర్మించడం ఒక్కటే మార్గం. అదొక్కటే జాతిని సాధికారికం చేయగలుగుతుంది. '

157. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.111 కోట్లు ప్రతిపాదించడమైనది.

విపత్తుల నిర్వహణ

158. ఇటీవల ఆంధ్రప్రదేశ్ 5 ప్రకృతి వైపరీత్యాలను చవిచూసింది. అవి, ఫైలీన్ తుఫాను, భారీ వర్షాలు, వరదలు, 'హెలెన్', 'లెహెర్' తుఫానులు మరియు 2013-14 లో సంభవించిన అకాల భారీవర్షాలు. ఈ విపత్తుల ద్వారా వాటిల్లిన నష్టాన్ని పూరించడానికి గాను రూ.2,969 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరుతూ

49