పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరఫరా, మురుగునీటి పారుదల, రవాణా, మురికివాడల సమగ్ర అభివృద్ధి, గృహనిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన, వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టబడుతున్నాయి. ఈ పథకం కింద ఇంతదాకా రూ. 6620 కోట్ల అంచనా వ్యయంతో 152 ప్రాజెక్టులు చేపట్టబడగా అందులో 94 పూర్తి చేయబడ్డాయి.

85. మునిసిపల్ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మిషన్ (మెప్మా) ద్వారా 19 లక్షలమంది మహిళలకు 1.82 లక్షల స్వయం సహాయకబృందాలుగా ఏర్పడడానికి తగిన సహాయం అందించబడింది. వారిలో 1.50 లక్షల స్వయం సహాయకబృందాలు రూ. 7727 కోట్ల మేరకు బ్యాంకు ఋణాలు పొందగలిగాయి.

86. ప్రస్తుతమున్న నీటిసరఫరా వ్యవస్థనూ, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా పట్టణ స్థానిక సంస్థల కింద ఉన్న ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యకరమైన పరిశుద్ధ వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

87. నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్‌యుఐఎస్) ఒక కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇ-గవర్నెన్స్ లో భాగంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచార వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ఉద్దేశం. దీని ద్వారా ఒక సమగ్ర సమాచారవ్యవస్థను నెలకొల్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిఐఎస్ పటాలు రూపకల్పనలో ఉన్నాయి.

88. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.3,134 కోట్లు ప్రతిపాదించడమైనది.

30