పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 1152 కోట్లు ప్రతిపాదించడమైనది.

పట్టణాభివృద్ధి


83. రాష్ట్రంలో 111 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. 2013-14 లో 28 మేజర్ గ్రామీణ పంచాయితీలు నగర పంచాయితీలుగా, గ్రేడ్-3 మునిసిపాలిటీలుగా ఉన్నతీకరించబడ్డాయి. కొన్ని ఆవాసాలను 6 మునిసిపల్ కార్పొరేషన్లలో చేర్చడం జరిగింది. పట్టణ స్థానికసంస్థలకు ఈ మధ్యనే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టుకేసుల కారణంగా 6 మునిసిపల్ కార్పొరేషన్లు, 6 మునిసిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించబడలేదు. ఈ పట్టణ స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను కోరనున్నది.

84. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ శరవేగంతో జరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీసమౌలిక సదుపాయాలు కల్పించడం ఒక సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీల నిర్మాణ పథకం నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక లబ్దిని పొందనుంది. ఈ పథకం క్రింద నిర్మించబడే స్మార్ట్ సిటీలు మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలతో పాటూ సాంకేతికతతో కూడిన జీవనోపాధి అవకాశాలను పెంపొందించే విధంగా అభివృద్ది చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 10 నుండి 12 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. పట్టణ ప్రాంతాలను సమగ్రంగానూ, సమూలంగానూ అభివృద్ది చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాన నిర్ణయాలను తీసుకుని ఎన్నో చర్యలు చేపట్టింది. భారతప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం జేఎన్ఎన్‌యుఆర్ఎస్ కింద రాష్ట్రప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటున్నది. ఇందులో భాగంగా నీటి

29