పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్ష రూపాయలు మించకుండా సరికొత్త పెట్టుబడి సమకూర్చడం ద్వారా స్వయం సహాయకబృందాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

67. సామాజిక భద్రత పింఛన్ల కింద 75 లక్షల మంది పింఛనుదారులకు రూ. 2,505 కోట్ల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. వృద్దులకూ, వితంతువులకూ, నేతపనివారికీ, కల్లుగీత కార్మికులకూ ఎఆర్‌టి కేసులకూ, 40-79 శాతం మేరకు వైకల్యం కలిగిన వికలాంగులకూ ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.200 పింఛనును నెలకు రూ.1,000 రూపాయలకి ప్రభుత్వం పెంపుదల చేసింది. 80 శాతం కన్నా ఎక్కువ వైకల్యం కల్గిన వికలాంగులకు జీవనభద్రత కోసం పింఛనును నెలకు రూ.1,500 కు పెంచింది. ఈ పెంచిన రేట్లు సెప్టెంబరు 2014 నుండి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 2,2014 నుండి చెల్లింపు కానున్నాయి.

68. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 6,094 కోట్లు ప్రతిపాదించడమైనది.

పంచాయితీరాజ్

69. నాప్రసంగంలో ఇంతకు ముందే చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం వికేంద్రీకరణను విశ్వసిస్తూ 73 వ రాజ్యాంగ సవరణలో పేర్కొనట్లు గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి వుంది. పంచాయితీరాజ్ శాఖ బిఆర్‌జిఎఫ్, ఆర్‌జిపిఎస్, 13వ ఆర్థికసంఘం నిధులు మరియు రాష్ట్ర ఆర్థికసంఘం నిధులు వంటి ముఖ్య కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

25