పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామీణాభివృద్ధి శాఖ

64. దారిద్ర్య నిర్మూలన కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద ఇచ్చే వేతనాలను ప్రభుత్వం ఇటీవలనే రోజుకు రూ. 149 నుంచి రోజుకు రూ. 169 కి పెంచడం జరిగింది. 2013-14 లో 34.3 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించబడింది. మొత్తం పథకం కింద రూ. 3,038 కోట్లు ఖర్చు కాగా అందులో రూ. 1970 కోట్లు నేరుగా వేతనరూపంలో చెల్లించబడింది. వ్యవసాయరంగంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో భాగం గా ప్రభుత్వం జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రైతులకు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవసాయకార్యక్రమాలను అమలు చేస్తున్నది.

65. భూసారం, పచ్చదనం, జలసంపద వంటి ప్రాకృతిక వనరులు అంతరించిపోకుండా పరిరక్షించడానికీ, అభివృద్ధి పరచడానికీ, తద్వారా నిరుపేద కుటుంబాలకు నికర జీవనోపాధి కల్పిస్తూ, వాతావరణ సమతౌల్యం కాపాడడం కోసం ఉద్దేశించబడ్డ సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం (ఐడబ్ల్యుఎంపి) 11 డిపిఎపి/డిడిపి జిల్లాల్లో అమలుజరుగుతున్నది.

66. ఋణాలను సకాలంలో చెల్లిస్తున్న స్వయం సహాయకబృందాలకు వడ్డీలేని ఋణాల పేరిట గ్రామీణదారిద్ర్య నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రోత్సాహకాలను అందిస్తున్నది. కేవలం మహిళలే సభ్యులుగా గల 6.56 లక్షల స్వయం సహాయకబృందాల్లో సుమారు 70 లక్షల మంది సభ్యులున్నారు. ఈ మొత్తం సభ్యులు పొదుపు చేసుకున్నది రూ.3,064 కోట్లు కాగా, కార్పస్గా జమ చేసుకున్నది రూ. 4,025 కోట్లు. ఒక్కొక్క బృందానికీ

24