పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్పాదాయ వర్గాల వారికి తక్కువ ధర లో ఆహారాన్ని అందించేందుకు 'అన్న క్యాంటీన్స్' ఏర్పాటుకు కృషి చేయనున్నాము.

61. ధరల్ని నియంత్రించడంకోసం, ఎసెన్షియల్ కమాడిటీల సరఫరాను సమర్థవంతంగా అమలు చేయటానికి చర్యలు చేపట్టడంతోపాటు, వివిధ రకాల మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. రైతుబజారు ద్వారా కూరగాయలు మొదలైనవి సముచితమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది.

62. రేషన్ కార్డులను ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తూర్పుగోదావరి జిల్లాలో ఈపీఓఎస్ మిషన్ల ద్వారా చేపట్టిన బయోమెట్రిక్ నిర్ధారణ వల్ల 15 శాతం మిగులు కనబడింది. ఈనిర్ధారణను తక్కిన రాష్ట్రం మొత్తానికి విస్తరించే విషయాన్ని పరిశీలించడం జరుగుతున్నది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన అందరు మహిళలకు కొత్తగా దీపం కనెక్షన్లను అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వరి పంటకు రైతుకు కనీస మద్దతు ధర పొందడానికి వీలుగా స్వయంసహాయక బృందాల ద్వారా ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.

63. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2318 కోట్లు ప్రతిపాదించడమైనది.

23