పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2013-14

25. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ముఖ్య అంశాలను క్లుప్తంగా వివరిస్తాను. ప్రస్తుత ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రస్థూల ఉత్పత్తి రూ. 4,19,391 కోట్లు కాగా, 2013-14 సంవత్సరానికి రాష్ట్రస్థూల ఉత్పత్తి రూ.4,75,859 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే 13.46 శాతం వృద్ధి నమోదయింది. స్థిర (2004-05) ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి రాష్ట్రస్థూల ఉత్పత్తి 2,35,930 కోట్లు కాగా 2013-14 కు 2,50,282 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే 6.08 శాతం వృద్ధి నమోదయింది. స్థిర ధరల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు 2013-14 సంవత్సరంలో 6.94 శాతం 2.16 శాతం 7.25 శాతం వృద్ధిరేటును సాధించాయి.

26. ప్రస్తుత ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి తలసరి ఆదా యం ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 76,041 కాగా 2013-14 కు రూ. 85,797 గా నమోదయింది. అంటే 12.8 శాతం పెరుగుదల సంభవించింది. స్థిర (200405) ధరల ప్రకారం తలసరి ఆదాయం 2012-13 కు రూ. 42,186 కాగా 2013-14 కు రూ.44,481 కి పెరిగింది. అంటే 5.4 శాతం వృద్ధి రేటు నమోదయింది.

వ్యవసాయం

27. మన రాష్ట్ర జనాభాలో అధికశాతం ఇప్పటికి జీవనోపాధి కోసం వ్యవసాయం మీదనే ఆధారపడినందువల్ల రాష్ట్రస్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17 శాతం దాకా ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారధాన్యాలు అందించగలగడం ద్వారా

12