పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తుత సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఒకేసారి ముంచెత్తింది. అందువల్ల ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కోవడానికి స్థానిక సమాజాలే కాక ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఈ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొనే సమయంలో ప్రజలు అరుదైన నాయకత్వ లక్షణాలను, ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని మరియు కరుణతో కూడిన నిస్వార్థ సేవను ప్రదర్శించడాన్ని చూస్తున్నాము. ఇదంతా ఉజ్వల భవిష్యత్తుకై ఆశావహ దృక్పథం తో మానవ జాతి చేసే నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఒక రాష్ట్రంగా మనం కూడా చీకటి అంచున ఉన్న వెలుతురుపై దృష్టిని కేంద్రీకరించి ఈ మహమ్మారి నిర్మూలనకై ఇదే తరహాలో సమిష్టిగా పోరాడుదాము.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారి మాటలను సంగ్రహంగా చెప్పాలను కుంటున్నాను:

మనము ఏది నాటామో అదే పొందుతాము.
మన విధికి మనమే బాధ్యులము.
గాలి వీస్తోంది.
తెరచాపలు తెరచి ఉంచిన నావలే ముందుకు సాగుతాయి.
ముడుచుకున్న తెరచాపలుగల నావలు గాలివాలును అందుకుని ముందుకు
వెళ్ళలేవు.
ఇది గాలి తప్పు అయితే కాదుగదా...?
మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటాము.

91. ఈ మాటలతో, నేను ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరమునకు బడ్జెట్ ప్రతిపాదనలను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను.

జై ఆంధ్రప్రదేశ్,

జై హింద్.

42