పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రపంచ బ్యాంక్ మద్దతుతో 250 మిలియన్ల డాలర్ల ఎస్.ఎ.ఎల్.టి. (SALT), ఇ. ఎ.పి. ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ లో అభ్యసన సంబంధ పరివర్తన ప్రాజెక్టు చేయబడుతోంది. ప్రాథమిక స్థాయిలో పునాది బలపరచడానికి, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన పెంచడానికి మరియు పాఠశాలల నిర్వహణను మెరుగుపరచటానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

ఆర్థిక వృద్ధి తీరుతెన్నుల సమీక్ష

2019-20 లెక్కలు

85. 2019 ఏప్రిల్ 01, నుండి 2020 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవిన్యూ లోటు 26,440.52 కోట్లు గాను, ద్రవ్యలోటు 39,684 కోట్లు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (G.S.D.P) పై, రెవిన్యూ లోటు 2.71% గాను, ద్రవ్యలోటు 4.08% గాను ఉంది.

సవరించిన అంచనాలు 2020-21

86. సవరించిన అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ వ్యయం రూ.1,52,990 కోట్లు. మూలధన వ్యయం రూ.18,797 కోట్లు. 2020-21 సం॥లో రెవెన్యూ లోటు సుమారు రూ.34,927 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు రూ. 54,369 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.54% మరియు 5.51% గా ఉన్నాయి.

బడ్జెటు అంచనాలు 2021-22

87. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, నేను రూ.2,29,779.27 కోట్లు వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.1,82,196.54 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలను తిరిగి చెల్లించడం కొరకు మరియు ఇతర

40