పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెరుగుపర్చడానికి, అసమానతలను తగ్గించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచే వ్యూహాలతో పాటు, పేదరికం మరియు ఇతర ఆర్థిక ఇబ్బందులను అంతం చేయడానికి అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (S.D.G.) విశ్వవ్యాప్తంగా పిలుపునిస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకా ఉనికిలో ఉన్నందున, ఈ క్లిష్ట సమయాలలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (S.D.G.) సాధనకు చేసే ప్రయత్నాలకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

8. అధ్యక్షా! ఏవిధమైన ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే అసమాన వ్యక్తిత్వం కలిగిన నాయకులు పురాతన కాలంనుండి మనకు తారసపడుతూనే ఉంటారు. వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుందని చెప్పవచ్చును.

గౌరవం కోల్పోయిన జీవితం, జీవితమే కాదు.
మాట నిలబెట్టుకోని మనిషి, మనిషే కాడు
జీవితంలో ప్రప్రథమంగా గుర్తుంచుకోవల్సినవి-
జాతి గౌరవము,దేశ కీర్తి ప్రతిష్టలు,
ఈ ఆలోచనలతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను,
లాభనష్టాల గురించిన ఆలోచనే లేదు.

మామూలుగా కంటే పైకి ఎదగడం, అంచనాలను అధిగమించడం, వజ్ర సంకల్పం మరియు దృఢ నిశ్చయంతో అపారమైన సవాళ్లను ఎదుర్కొనడం మన ప్రియతమ ముఖ్యమంత్రిగారి లక్షణాలు. వారి స్పష్టమైన దృష్టి, సున్నితమైన ప్రవర్తన, సంక్షేమానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతపై వారికి ఉన్న నమ్మకం మరియు మా బృందానికి వారు అందించే ప్రేరణ, మాకు, మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మరియు సంతోషం కలిగించే విషయం.

4