పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమర్థవంతమైన, జవాబుదారీ మరియు సమగ్ర సంస్థలను నిర్మించడం'లకు అనుగుణంగా ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థలను ప్రారంభించింది. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైంది. రెవెన్యూ సేవలు, భూ దస్తావేజుల సేవలు, ధృవపత్రాల జారీ మొదలైన అనేక సేవలు గ్రామ మరియు వార్డు సచివాలయాలతో అనుసంధానించబడ్డాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో పునః సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు, నిజమైన హక్కుదారులకు నవీకరించబడిన ప్రాథమిక రికార్డులను అందించడానికి, పునర్వవ్యవస్థీకరణ కార్యకలాపాలను వ్యవస్థీకృత పద్ధతిలో నిర్వహించడానికి, భూమి లావాదేవీల రికార్డులను సమయానుసారంగా ప్రభుత్వం తయారు చేసింది.

83. 2021, ఏప్రిల్ 12, ఉగాది రోజున ప్రభుత్వం, కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అవినీతి జాడలేకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినందుకుగాను మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హతగల ప్రతి పౌరుని వద్దకు వచ్చేలా చూసినందుకు 2 లక్షల 23 వేల మంది గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లను 228 కోట్ల 74 లక్షల రూపాయల నగదు పారితోషకంతో పాటు సత్కరించింది.

84. 2020 సంవత్సరములో మన గౌరవ ముఖ్యమంత్రిగారిని దక్షిణ ఆసియాలో నున్న మానవ అభివృద్ధి ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కలిసిన సందర్భములో, వివిధ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలుపుతామని ఈ బృందం హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక, రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారు 3,648 కిలోమీటర్ల 'పాదయాత్ర’ చేపట్టడం ద్వారా అట్టడుగు స్థాయిలోనున్న ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని - విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలలో వారు చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసించింది. గ్రామ స్థాయి నుండే డేటాను అందుబాటులో ఉంచి, వార్డ్ మరియు గ్రామ సచివాలయాల ద్వారా ఇ-గవర్నెన్స్ అమలు చేయడం సరైన దిశలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా ఈ బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతం

39