పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంధన రంగం

79. ప్రభుత్వం రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తును 18 లక్షల 40 వేల వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమేగాక, 21 లక్షల 73 వేల షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తోంది. వీటితోపాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలకు, ధోభీ ఘాట్లకు, దారిద్ర్యరేఖకు దిగువనున్న (B.P.L.) రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్ ను అందిస్తున్నాము. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్ ను అందించడం ద్వారా 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన, 'సరసమైన, నమ్మకమైన, స్థిరమైన మరియు ఆధునిక విద్యుత్ శక్తి అందించటం' ను సాధిస్తున్నాము.

80. ఇంధన రంగంలో సంస్కరణ ఆధారిత చర్యలను ముందుకు తీసుకొనిపోవడం ద్వారా, ఉచిత విద్యుత్ కోసమై ప్రత్యక్ష నగదు బదలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. రైతులు వినియోగించే విద్యుత్తు యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని కొలవడానికి, వ్యవసాయ పంపు సెట్లకు పొలాలలో మీటర్లను ఏర్పాటు చేసి తత్సంబంధిత విద్యుత్ వినియోగ ఖర్చు సొమ్మును రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వ సంకల్పం.

81. 2021-22 సం॥లో, నేను ఇంధన రంగానికి 6,637 కోట్ల 24 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన

82. 16వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'శాంతియుత మరియు సమగ్ర సమాజాలను ప్రోత్సహించడం, అందరికీ న్యాయం కల్పించడం మరియు అన్ని స్థాయిలలో

38